తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ వర్షాల జోరు

హైదరాబాద్‌లో పలుచోట్ల కుండపోత వర్షం
లోతట్టు ప్రాంతాల్లో జలమయంతో ఇబ్బందులు
అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్‌ పోలీసుల ఆదేశాలు
రెండ్రోజల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక
కాళేశ్వరం వద్ద మరోమారు పొంగి ప్రవహిస్తున్న గోదావరి
శ్రీశైలానికి ఎగువనుంచి వరదతో నేడు గేట్లు ఎత్తివేతకు రంగం సిద్దం

హైదరాబాద్‌,జూలై22(జనం సాక్షి ): రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో మరోమారు భారీవర్షం కురుస్తోంది. తెలంగాణలో భారీ వర్షలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరించింది. తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం మొదలయ్యింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. మరోవైపు ద్రోణి ప్రభావంతో రెండ్రోజులపాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. నల్గొండ జిల్లాలోని తెల్‌ దేవరపల్లిలో అత్యధికంగా 6 సెంటీ విూటర్ల వర్షం పడగా… కరీంనగర్‌ జిల్లాలలో 5.4 సెంటీ విూటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ, మేడిపల్లిలో 4 సెంటీవిూటర్ల వర్షం పడిరది. జగిత్యాల జిల్లా గొల్లప్లలె, నిర్మల్‌ జిల్లా వాద్యాల్లో 3 సెంటీ విూటర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌, యాదాద్రి, సూర్యాపేట, నాగర్‌ కర్నూల్‌, నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌, అల్వాల్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, మియాపూర్‌, కూకట్‌ పల్లి, చందానగర్‌, తార్నాక, బాలానగర్‌, జీడిమెట్ల, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, యూసఫ్‌గూడ, అవిూర్‌పేట్‌, ఎస్సార్‌ నగర్‌, పంజాగుట్ట, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్‌, మసాబ్‌ ట్యాంక్‌, కాచిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి నగరవ్యాప్తంగా వర్షం కురియడంతో రోడ్డెక్కిన వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు వచ్చి చేరడంతో పలుచోట్ల ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో ఆఫీసులకు వెళ్లే వారు ప్రయాణాన్ని గంట పాటు వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వర్షం తగ్గుముఖం పట్టినా రోడ్లపై వాటర్‌ క్లియర్‌ చేసేందుకు సమయం పడుతుందని పోలీసులు తెలిపారు. రోడ్లపై నెమ్మదిగా వెళ్ళమని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సూచనలు చేశారు. కాళేశ్వరం పుష్కరఘాట్‌ వద్ద 10.960 విూటర్ల ఎత్తులో గోదావరిప్రవహిస్తోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అధికారులు లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ ఇన్‌ ఎª`లో, ఔట్‌ ఎª`లో 7,15,140 క్యూసెక్కులుగా ఉంది. అటు సరస్వతి(అన్నారం) బ్యారేజీలోని మొత్తం 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ ఎª`లో, ఔట్‌ ఎª`లో 44,480 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ పూర్తి సామర్థ్యం 0.23 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 0.16 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఇదిలావుంటే శ్రీశైలం డ్యాంకు వరద పరవళ్లు తొక్కుతోంది. గత కొద్ది
రోజులుగా కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం డ్యామ్‌ నీటిమట్టం వడివడిగా పెరుగుతూ గరిష్ట నీటిమట్టానికి చేరుకుంది. ఎగువన అటు కృష్ణానదిపై జూరాల నుంచి.. మరో వైపు తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల నుంచి భారీ స్థాయిలో వరదనీరు పరవళ్లు తొక్కుతూ శ్రీశైలానికి చేరుకుంటోంది. డ్యామ్‌ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో రేపు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఇన్‌ ఎª`లో లక్షా 52 వేల 396 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881 అడుగులుగా ఉంది. అలాగే డ్యామ్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 195.21 టీఎంసీలు నిల్వ ఉంది. ఎడమగట్టు జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. రేపు అంటే శనివారం శ్రీశైలం డ్యామ్‌ గేట్లు తెరచి నీటి విడుదల ప్రారంభించనున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.