తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం…….

టేకుమట్ల.జూలై (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు.  సోమవారం టేకుమట్ల మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన  కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి కార్యక్రమానికి భూపాలపల్లి  శాసనసభ్యులు గండ్ల వెంకటరమణ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై 22 కల్యాణ లక్ష్మి, మూడు ముఖ్యమంత్రి సహాయ నిధి  చెక్కులను ఆయా గ్రామాల లబ్ధిదారులకు అందజేశారు.అనంతరం శాసనసభ్యులు గండ్ర  వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక బృహత్తరమైన సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న  సంక్షేమ పథకాలైన రైతుబంధు,రైతు బీమా, దళిత బంధు, అభివృద్ధి పథకాలైన పల్లె ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, క్రీడా మైదానాలు, హరితహారం లాంటి అనేక పథకాలు అమలు  చేస్తున్నారని, రైతులకు కోతలు లేని కరెంటు, సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు విత్తనాలు  అందిస్తూ, రైతులు పండించిన పంటలు గిట్టుబాటు ధర కల్పిస్తూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల సమస్యలు తీరుస్తున్నారని ఆయన అన్నారు. అలాంటి ప్రభుత్వానికి రైతులందరూ,  ప్రజలందరూ కృతజ్ఞతతో ఉండాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి,జడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి,వైస్ ఎంపీపీ పోతనవేణి ఐలయ్య,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు సట్ల రవి గౌడ్, సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షులు గుడిగంటి మహేందర్, సర్పంచులు పొలాల సర్వోత్తమ్ రెడ్డి, ఉద్దమారి మహేష్ యాదవ్, పండుగ శ్రీనివాస్ యాదవ్,నల్లబెల్లి రామా రవీందర్,గజ్జి సుజాత రమేష్ యాదవ్, బిళ్ళకంటి ఉమేందర్రావు,నేరెళ్ల శ్రీనివాస్,చదువు మధుర మహేందర్ రెడ్డి, కందుల విజయ దేవేందర్, కట్కూరి నరసింహారెడ్డి,చింతలపల్లి విజయ స్వామి రావు, అడగాని లతా రామారావు, నందికొండ శోభారాణి మహిపాల్ రెడ్డి,  ఎంపీటీసీలు ఆది సునీత రఘు, సంగి రవి, పింగిలి వెంకటేశ్వర్ రెడ్డి, పెరుమళ్ళ చంద్రకళ మొగిలి, ఆయా గ్రామాల లబ్ధిదారులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.