తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండుగ.

మున్సిపల్ చైర్ పర్సన్ కల్పనా భాస్కర్ గౌడ్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్25(జనంసాక్షి):
తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ పండుగ అని నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్ పర్సన్ కల్పన భాస్కర్ గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ మరియు మెప్మా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల ను నిర్వహించారు.మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను తయారుచేసి బొడ్డెమ్మలు వేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ… ప్రకృతిని,పూలను దైవంగా కొలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ జీవన విధానమని, అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మెప్మా డి ఎం సి రాజేష్, పురపాలక సంఘం సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.