తెలంగాణ సెట్స్‌ కన్వీనర్ల నియామకం

1

హైదరాబాద్‌,ఫిబ్రవరి4(జనంసాక్షి): తెలంగాణ సెట్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం కన్వీనర్లను నియమించింది. ఎంసెట్‌

కన్వీనర్‌గా ఎన్‌వి రమణారావు (జేఎన్‌టీయూహెచ్‌), లాసెట్‌, పీజీ లాసెట్‌ కన్వీనర్‌గా ఎంవీ రంగారావు (కేయూ),

ఈసెట్‌ కన్వీనర్‌గా ఎం.యాదయ్య (జేఎన్‌టీయూహెచ్‌), ఐసెట్‌ కన్వీనర్‌గా కె.ఓంప్రకాశ్‌ (కేయూ), ఎడ్‌సెట్‌

కన్వీనర్‌గా ప్రసాద్‌ (ఓయూ), పీఈసెట్‌ కన్వీనర్‌గా జె.ప్రభాకర్‌రావు (ఓయూ),  పీజీ ఈ సెట్‌ కన్వీనర్‌గా

వేణుగోపాల్‌రెడ్డి (ఓయూ) నియమితులయ్యారు.