తెలుగులో చట్టాల ఆవశ్యకత

ప్రజలందరికీ చట్టం తెలుసన్న భావనని చట్టం భావి స్తుంది. నిజానికి చట్టం గురించి ప్రజలకి ఏ మాత్రమూ తెలియ దంటే అతిశయోక్తి కాదు. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు కూడా తెలియని వ్యక్తులు ఎందరో మనదేశంలో వున్నారు. చట్టం తెలియక పోవడాన్ని చట్టం క్షమించదు. శాసనము తెలియదని ఎవ రన్నా ఏదైపా వాదన తీసుకున్నా చట్టం దాన్ని ఆమోదించదు. ప్రతి ఒక్కరూ శాసనానికి బద్ధులై వుండాలని చట్టం ఆదేశిస్తుంది. అది సహేతకమా కాదనన్నది చర్చించాల్సిన అంశం.మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజలే అంతిమ అధికార నిర్ణేతలు. ప్రభుత్వ అధికార పత్రం చట్టం ప్రచురితమైతే చాలు ప్రజలందరికీ తెలిసినట్టుగా భావిం చాలని చట్టం నిర్దేశిస్తుంది. రాజపత్రం ఎంతమంది ప్రజలకి అందు బాటులో వుంటుంది. ఎంతమందికి దాన్ని చూసే అవకాశం వుంది. ఎక్కువశాతం ప్రజలు మనదేశంలో నిరక్షరాస్యులు వున్నప్పుడు అందరికీ న్యాయపరిజ్ఞానం వుందని భావించడం సరైందేనా?మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులని పొందుపరిచారు. రాజ్యాంగంతో పాటూ కేంద్ర రాష్ట్ర ప్ర భుత్వాలు ఎన్నో శాసనాలని ప్రజలకోసం మరీ ముఖ్యంగా మహి ళల కోసం, బడుగు వర్గాల కోసం తెచ్చాయి.శాసనాలు సమాజం కోసం తయారు చేసినవి. మనదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు, భిన్న భాషలు మాట్లాడే ప్రజలు వున్నారు. మనదేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాషని ప్రజలు మాట్లాడుతారు. స్వాతం త్య్రానికి పూర్వం చాలా ప్రాంతాల్లో ఆంగ్లం అధికార భాషగా వుండే ది. కొన్ని ప్రాంతాల్లో ఉర్దూ కూడా అధికార భాషగా వుండేది. కోర్టు లలో కూడా ఆయా అధికార భాషలే వాడుకలో వుండే వి.స్వాతంత్య్రం తరువాత కూడా మన రాష్ట్రంలోని కోర్టులలో ఇంగి ్లషే కోర్టు భాషగా చలామణీ అవుతుంది. తెలుగు ఉర్దూలని ఇంకా ఇతర భాషలని కోర్టు భాషలుగా కొన్ని ప్రాంతాలలో పరిగణిం చాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా కూడా ఆంగ్లమే ప్రధాన భాషగా కొనసాగుతున్నది.ఇంగ్లిషు ప్రపంచ భాషగా ఎదిగిపోయింది. మన చట్టాలన్నీ ఇంగ్లిషులోనే వుంటాయి. విదేశా లకి వెళ్లాలంటే ఇంగ్లిషు అత్యంత అవసరం. ఇంగ్లిషు ప్రాధాన్యతని కాదనలేం. మంచి ఇంగ్లిషు వచ్చిన న్యాయవాదుల వాదనలని కోరి న్యాయమూర్తులు శ్రద్ధగా ఆలకిస్తారు. వారికి ప్రాధాన్యతని ఇస్తారు. ఇది కాదనలేని సత్యం. మనదేశంలో చాలామందికి తెలుగు రాయడం, చదవడం కూడా రాదు. కానీ వాళ్లు తెలుగును అర్థం చేసుకోగలరు. పోలీసు, కోర్టు వివాదాల్లో ఇరుక్కున్న ప్రజలు బాధలు చెప్పడానికి వీల్లేదు. కోర్టులలో ఏమి జరుగుతుందో తెలియ దు. న్యాయవాదులు, న్యాయమూర్తులు ఎక్కువశాతం ఇంగ్లి షులోనే మాట్లాడుకుంటారు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు వారికి బోధ పడవు. తమ కేసు ఎందుకు వాయిదా పడిందో వారికి తెలి యదు. ఇలాంటి సందర్భాల్లో కక్షిదారులు మోసపోయే పరిస్థి తులు ఎక్కువగా వున్నాయి.చట్టానికి ప్రజలు బద్ధులై వుండాలి. శాసనాలని ప్రజలు అనుసరించాలి. ఈ సభ్య సమాజంలో ఈ విషయాన్ని కాద నలేం. ఈ పరిస్థితి వుండాలంటే ప్రజలకి చట్టాలు తెలియాలి. అవి అర్థం కావాలి. ప్రజలకి అర్థం కావాలంటే అవి ప్రజల భాషలో వుం డాలి. కానీ మన చట్టాలు ప్రజల భాషలో లేవు. అవి ఇంగ్లిషులో వున్నాయి. ఇంగ్లిషులో వున్న చట్టాలు ప్రజలకు అవగతం అయ్యే అవకాశం లేదు. ప్రభుత్వ పనితీరు ప్రజలకు తెలియాలంటే పాలన ప్రజల భాషలో జరగాలి.చట్టాలని అర్థం చేసుకోవడం అంత సులు వుకాదు. చట్టంలో సుదీర్ఘ వాక్యాలు, సంక్లిష్ట వాక్యాలూ వుంటాయి. ఇంగ్లిషు భాషా పరిజ్ఞానం వున్న వ్యక్తికే శాసనాలు సరిగ్గా అర్థం కావు. న్యాయవాదులకి, న్యాయమూర్తు సహితం చట్టం అంత సులు వుగా అర్థం కాదు. చట్టాలని ఎందుకు సంక్లిష్టంగా రాస్తారో అర్థం కాదు. చిన్న చిన్న వాక్యాలలో రాస్తే సులభంగా అర్థం చేసుకునే వీలు చిక్కుతుంది. ఇలాంటి పరిస్థితులలో తెలుగు మాత్రమే తెలిసిన వ్యక్తికి శాసనాలు అర్థం కావడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం.న్యాయసేవల అధికారాల చట్టం అమల్లోకి వచ్చిన తరువాత న్యాయ విజ్ఞానాన్ని ప్రజలకి అందించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఏర్పడింది. ‘కరదీపికలు’లాంటి పుస్తకాలు కాకుం డా చట్టాలని సులభశైలిలో ప్రజలకి అందించాల్సిన బాధ్యత న్యాయ సేవాధికార సంస్థల మీద కూడా వుంది. లా చదివిన వ్యక్తులు, న్యాయవాదులు ప్రజలకి న్యాయశాస్త్రాలని పరిచయం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా వుంది.

వీరందరికన్నా ముఖ్యమైన బాధ్యత ప్రభుత్వంపై వుంది. న్యాయశాస్త్ర గ్రంథాలని ప్రభుత్వం ఒక్కటి కూడా ప్రచురించలేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గానీ భారత ప్రభుత్వం గానీ ఇంగ్లిషులో వున్న శాసనాలని తెలుగులో తీసుకొని రావడానికి చేసిన పనిశూన్యం.1966 మే 14వ తేదీన తెలుగుని అధికార భాషగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. 19.3.1974లో మొదటి అధికార భాషాసంఘం ఏర్పడింది. కానీ చట్ట సంబంధమైన పుస్త కాలని ప్రచురించడానికి కమిషన్‌ కృషి చేయలేదని అన్పిస్తుంది. ఎ.బి.కె. ప్రసాద్‌ అధికార భాష సంఘం అధ్యక్షులుగా నియ మితులైన తరువాత ‘రాజ్యాంగాన్ని’ తెలుగులో ప్రచురించారు. తెలు గు తీర్పులు కొన్నింటిని నమూనాలుగా ప్రకటించారు. కానీ చాలా తెలుగు తీర్పులు అందులో చోటు చేసుకోలేదు. అయినప్పటికీ ఆ యన చేసిన పనిని అభినందించాల్సిందే.ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషాచట్టం, 1966లోని నిబంధన 3(2) ప్రకారం శాసన వ్యవస్థలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, జారీ చేసే ఆర్డినెన్స్‌లు, నియమాలు, రెగ్యులేషన్స్‌ని తెలుగులో ప్రవేశపెట్టాలి. దీని గురించి ప్రభుత్వం ఒక ప్రకటనని జారీ చేసిన తేదీ నుంచి ఆ విధంగా ప్రవేశపెట్టాల్సి వుంటుంది. ప్రభుత్వం ఆ విధంగా ప్రకటన చేసిందా లేదానన్న విషయం తెలియదు. కానీ చాలా కాలంగా ప్రభుత్వం తెలుగులో కూడా బిల్లులని తయారు చేస్తుంది. అయితే అవి ఇంగ్లిషులో తయారైన వాటికి అనువాదం మాత్రమే.ప్రభుత్వం ఈ విధంగా తయారు చేసిన చట్టాలు రాజపత్రంలో ప్రచురితమైతాయి తప్ప అవి ప్రజలకి అందుబాటులో వుండవు. ఒకవేళ వాటిని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన అవి ఎవరికీ అర్థంకాని విధంగా వుం టాయి. ఈ విధంగా గొట్టుభాషలో వుండటానికి కారణం తెలియదు కానీ అవి తెలుగులో ప్రావీణ్యం వున్న వ్యక్తులు కూడా అర్థం చేసుకో లేరు. భారత ప్రభుత్వం ప్రచురించిన చట్టాలు కూడా ఇదే కోవలోనే వున్నాయి. ఈ చట్టాలు చదివిన వ్యక్తులు ఎవరైనా కూడా చట్టాలని తెలగులో చదవడానికి సాహసించరు. ఉదాహరణకి జూతీశీపa్‌ఱశీఅ శీటటవఅసవతీర aష్‌, 1958ని తెలుగులో అనువదించి ప్రచురిం చారు. ఈ చట్టానికి తెలుగు అనువాదం ‘అపరాధుల పరిరక్షణ చట్టము, 1958. చట్టం పేరువరకు అనువాదం బాగానే వుంది కానీ 19 నిబంధనలు వున్న చట్టాన్ని అర్థ చేసుకోవడానికి చాలా శ్రమించాల్సి వస్తుంది. ప్రభుత్వం రాజపత్రంలో ప్రకటించిన తేదీ నుంచి చట్టం అమల్లోకి వస్తుందని అనువాదం చేయడానికి అందులో చేసిన అనువాదం – ‘ఆ రాజ్య ప్రభుత్వం రాజపత్రములో అధిసూచన ద్వారా నియతము చేయు తేదీన అమలులోకి వచ్చును.

‘నిర్దేశించిన’ అంటే ఈ చట్టములోని నియమాల ప్రకారం నిర్దేశించిన అని రాయాల్సిన దానిని ఈ చట్టంలో ఈ విధంగా రాశారు ‘విహితపరచబడిన’ అనగా ఈ చట్టం కింద చేయ బడిన నియమావళి ద్వారా విహిత పరచబడిన అని అర్థము. ఇది అర్థం చేసుకోవాలంటే ఎంత కష్టపడాల్సి వుంటుంది. నిబంధన అన్న పదాన్ని ‘పరిచ్ఛేదము’ అని గతంలో శిక్షపడిన అన్న పదానికి ‘పూర్వపు దోష స్థాపన జరిగినదని’ రహస్యమైన అన్నదానికి ‘గోపనీయమైన’ అని ‘వివరణ’ అని చెప్పదల్చిన దానిని ‘విశదీ కరణము’ అని ఇట్లా ఎన్నో గొట్టు పదాలతో అనువాదాలు వుం టాయి. ఈ చట్టంలోని కఠిన పదాలు, గ్రాంధిక పదాలు మచ్చు కుకొన్ని. వ్యవహార భాషలో ఒక అనువాదం, ఒక్క చట్టం వుండ దు.ప్రభుత్వ అనువాదాలు, లేక మూల చట్టాలు ఇంత కఠినంగా వుంటే ప్రభుత్వంలో లేని వ్యక్తులు పుస్తకాల్లో వ్యవహార భాష వుండి ప్రజలు సులభంగా అర్థం చేసుకుంటున్నారు. యాభై వరకు చట్టాలని తెలుగులో నేను రాసిన పుస్తకాలు ఎన్నో పునర్ముద్రణ పొందుతున్నాయి. అదేవిధంగా పెండ్యాల సత్యనారాయణ రాసిన పుస్తకాలు నలదోగం క్రిష్ణారావు రాసిన పుస్తకాలు కూడా పునర్ముద్రణలు పొందుతున్నాయి. ప్రచురణకర్తల నుంచి ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు నేను తెలుగులో చట్టసంబంధమైన పుస్తకాలని రాయలేకపోతున్నాను. ఇది ఒకరో ఇద్దరు వ్యక్తులు చేయాల్సిన పనికాదు. ప్రభుత్వం చేయాల్సిన పని. కొన్ని సంస్థలు చేపట్టాల్సిన పని.తెలుగులో న్యాయశాస్త్ర పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. తెలుగులో న్యాయ పాలన జరగాలంటే తెలుగులో న్యాయశాస్త్ర పుస్తకాలు రావడం అత్యంత అవసరం. ఈ పనిని ఒకటి రెండు సంవత్సరాలలో చేయలేం. అంచెల వారీగా చేయాలి. ముందుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తయారు చేసిన చట్టాలలో ముఖ్యమైన వాటిని తెలుగులో అనువాదం చేయాలి. ఆ తరువాత భారత ప్రభు త్వం తయారు చేసిన చట్టాల అనువాదాలను తీసుకొని రావాలి. ఇది ఈ రంగంలో చేయి తిరిగిన రచయితలతో లేదా వారి పర్యవ ేక్షణలో చేయించాలి. ఈ పనికి ప్రభుత్వం, అధికార భాషాసంఘం, తెలుగు అకాడమీలు పూనుకోవాలి. వీటి మధ్య సమన్వయం వుం డాలి. ప్రభుత్వం అధికార భాషాసంఘం ఈ పనికి పూనుకోకుండా తెలుగులో న్యాయపాలన గురించి ఎన్ని సదస్సులు ఏర్పాటు చేసినా అనుకున్న ఫలితాలు రావు.ఈ పుస్తకాల తరువాత పైకోర్టు తీర్పుల అనువాదం గురించి కింది కోర్టు తీర్పుల గురించి మాట్లాడ వచ్చు.చట్టం అవసరం లేని ప్రజలు ఎవరూ వుండరు. తెలుగులో చట్టాలు వుంటే సులభంగా అర్థం చేసుకుంటారు. ప్రజలు తెలు గులో న్యాయశాస్త్ర గ్రంథాలని కోరుకుంటున్నారు. అది ఆ కోరికను మన్నించాల్సిన బాధ్యత ప్రజల మీదనే కాదు రచయితల మీద కూడా వుంది.