తెలుగు జాతి ఆత్మగౌరవం ఏడ తాకట్టు పెట్టినవ్‌

 

రీకాంగ్రెస్‌తో కుమ్మక్కు ఎట్లైనవ్‌  శ్రీబాబుపై హరీశ్‌ ఫైర్‌

..హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) :

తెలుగుజాతి ఆత్మగౌరవం ఏడ తాకట్టు పెట్టావని టీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రి చిదంబరంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చీకటి ఒప్పందం చేసుకోవడంవల్లే ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకుని తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని ఆయన ధ్వజమెత్తారు. పాదయాత్రలో నిత్యం కాంగ్రెస్‌ పార్టీని తూర్పారబట్టే చంద్రబాబు సమయం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాన్ని ఉపయోగించుకోకుండా కాంగ్రెస్‌ పార్టీని గెలిపించేందుకు ప్రయత్నించడంలో అర్థమేమిటన్నారు. ఈ విషయంపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. జగన్‌ పార్టీ చంద్రబాబు పార్టీలు         వి

రెండు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు. నిజంగా చంద్రబాబుకు తెలియకుండా ఆ ముగ్గురుఎంపీలు సభను బహిష్కరిస్తే వారిపై ఎందుకు చర్య తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ ముగ్గురిని బహిష్కరించి నిజాయితిని నిరూపించుకోవాలని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. ఇది ముమ్మాటికీ చంద్రబాబు కాంగ్రెస్‌తో చేసుకున్న చీకటి ఒప్పందమేనని ఆయన ధ్వజమెత్తారు.