తెలుగు రాష్ట్రాల్లో తెలిసేలా జోగులాంబ దేవీ నవరాత్రి ఉత్సవాలు జరపాలి
ఎమ్మెల్యే డా.వీఎం అబ్రహం
నవరాత్రి వాల్ పోస్టర్ పాంప్లెట్స్ ను విడుదల చేసిన ఎమ్మెల్యే. ఆలయ ఇఓ. చైర్మన్
ఆలంపూర్ జనం సాక్షి (సెప్టెంబర్ 15 )
రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అలంపురం శ్రీ జోగుళాంబ అమ్మవారి ఆలయంలో ఈనెల 26వ తేదీ నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు నిర్వహించే జోగులాంబ దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసేలా నిర్వహించాలని అలంపురం ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం అబ్రహం అన్నారు .
గురువారం జోగులాంబ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి, ఈవో పురేందర్ కుమార్, ఆలయ చైర్మన్ బెక్కెం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అబ్రహం వీటిని ఆవిష్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠం కాబట్టి భక్తులు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలి వస్తారని , భక్తుల సంఖ్యను ముందస్తుగా అంచనా వేసి కనీస సౌకర్యాలన్ని ఏర్పాటు చేయాలని దేవస్థానం వారికి సూచించారు .
అదేవిధంగా దేవస్థానం ఈవో పురేందర్ కుమార్,చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆలోచనల మేరకు ఇకపై జోగులాంబ అమ్మవారి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలు అన్నిటిని ఆన్ లైన్ సేవలు అందించేందుకు ఆంధ్ర బ్యాంకు వారు నూతన వెబ్ సైట్ రూపొందిస్తున్నారంటూ వారు చెప్పారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పురేంద్ర కుమార్ మాట్లాడుతూ దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ సూచనల మేరకు జోగులాంబ అమ్మవారి ఆలయంలో అమ్మవారి మరియు శ్రీ యంత్రం ఉండే విధంగా డాలర్లను నూతనంగా భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. దీని ధర నామమాత్రంగా రూ. 75 రూపాయలకే భక్తులకు అందజేయనున్నట్లు వారు వివరించారు. శ్రీ యంత్రం అనేది లక్ష్మీప్రదం కాబట్టి ప్రతి ఒక్కరు వారి వారి ఇళ్లల్లో ఉంచుకొని పూజించుకునే విధంగా భక్తుల నివాస గృహాల్లో సకల ఐశ్వర్యాలు సకల సౌభాగ్యాలు చేకూరే విధంగా జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో ఈ డాలర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వారు చెప్పారు .
అనంతరం మున్సిపల్ చైర్మన్ మనోరమ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి మాట్లాడుతూ ఇటీవల అలంపురం ఆలయాలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయని ఆలయ ఇవ్వగా పురేందర్ కుమార్ వచ్చిన తర్వాత వారి ఆలోచన విధానాలతో దేవస్థాన అభివృద్ధికి చక్కటి బాటలు వేస్తున్నారని వారు ఈవో. చైర్మన్ సేవలను కొనియాడారు. అనంతరం వచ్చిన అతిథులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు ఆలయ ధర్మకర్తలు టిఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.