తెల్లవారు జామున దోపిడీ
ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన పోలీసులు
భారీగా సొత్తు స్వాధీనం
హైదరాబాద్,నవంబర్6(జనంసాక్షి): సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రయాణికులను బెదిరించి వారి సొత్తును కాజేస్తున్న ముఠాలను నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను విూడియా ముందు ప్రవేశపెట్టిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, కేసుల వివరాలను వెల్లడించారు.
నార్త్ జోన్ పరిధిలోని బస్టాప్ లలో తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో ప్రయాణికుల దృష్టి మరల్చి దోపిడి చేస్తున్న ఐదుగురితో పాటు.. దొంగతనాలు చేస్తున్న మరో ఇద్దరిని గోపాలపురం పోలీసులు అరెస్ట్
చేశారు. మరో కేసులో మార్కెట్ పోలీసులు బంగారం షాపులో చోరికి పాల్పడ్డ నిందితుడిని అరెస్ట్ చేశారు.
జవహర్ నగర్ కు చెందిన రజనీకాంత్, అతని నలుగురు మిత్రులతో కలసి ఉదయం బైక్లపై వచ్చేవారు. బస్టాప్ లో ఉన్న ప్రయాణికుల దగ్గరికి వెళ్లి అర్జంట్‌గా ఫోన్ మాట్లాడాలని తీసుకునేవారు. మరో ఇద్దరు వెనుక నుంచి దాడి చేసి దొరికిన సొమ్ముతో పరారయ్యేవారు. మరో కేసులో నిర్మానుష్య ప్రాంతం వద్ద మూత్ర విసర్జనకు వెళ్ళిన వ్యక్తిని చితకబాది, అతని దగ్గరున్న బంగారు గొలుసుతో పరారయ్యారు.
టెక్నాలజీ సహకారంతో 15 రోజుల్లోనే 22 కేసులను నార్త్ జోన్ పోలీసులు ఛేదించారని సీపీ అంజనీకుమార్ చెప్పారు. 22 కేసుల్లో 26మంది నిందితులను కటకటాల వెనక్కి నెట్టామన్నారు. ప్రతి టీం చాలా కష్టపడి కేసులను వారం రోజుల లోపునే పరిష్కరించారని ప్రశంసించారు. నేరం జరిగితే వెంటనే 100 నంబర్ కు ఫోన్ చేయాలని సీపీ సూచించారు.