తైవాన్‌లో కూలిన ఏసియా వినానం
31 మంది మృతి
పలువురికి గాయాలు
తైవాన్,ఫిబ్రవరి4(జనంసాక్షి): విమాన ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తైవాన్ రాజధానిలో ఓ విమానం నదిలో కుప్పకూలింది. ట్రాన్స్ ఏషియా సంస్థకు చెందిన విమానం తైపీ నదిలో కూలింది. ఈ దుర్ఘటనలో 31మంది మృతి చెందారు. ప్రమాదం జరిగినప్పుడు ఈ విమానంలో 58మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కాగా విమానంలో చిక్కుకున్నవారిలో 17మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. నదిలో చిక్కుకుపోయిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. 58 మంది ప్రయాణికులతో బయలుదేరిన ట్రాన్స్ ఏసియా విమానం తైపీ సవిూపంలోకి రాగానే అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొట్టింది. ఆతర్వాత శివారులోని కీలంగ్ నదిలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 9మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఘటనా స్థలికి చేరుకున్న స్థానికులు, సహాయక సిబ్బంది 17 మంది ప్రయాణికుల్ని సురక్షితంగా రక్షించారు. గల్లంతైన వారి కోసం కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ప్రమాదానికి ముందు విమానం టేకాఫ్ అయిన తర్వాత రోడ్డు బ్రిడ్జిని ఢీకొన్నట్లు తెలుస్తోంది. దాంతో విమానం అదుపు తప్పి నదిలో కూలింది. కాగా విమానం దాదాపు నదిలో మునిగిపోయే దృశ్యాన్ని తైవాన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ చిత్రీకరించింది. తైవాన్ స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10.50కి సిగ్నల్స్ తెగిపోయాయి. మరికాసేపట్లో లాండింగ్ కావాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద వార్తతో ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మృతుల బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. విమానం తైపీ నుంచి కిన్మెన్ ద్వీపానికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.