తొలిమెట్టు పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారి నియామకం.

ఆగస్టు15నుండి జరిగే ఎఫ్ఎల్ఎన్ కార్య‌క్ర‌మంను విజయవంతం చేద్దాం.
జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజులు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జులై 27(జనంసాక్షి):
విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించేందు కు అమలు చేసే తొలిమెట్టు కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించనున్న‌ట్లు డిఈఓ గోవిందరాజులు తెలిపారు.బుధవారం మండల విద్యాధికారులతో డిఇఓ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….తొలిమెట్టు మోడల్ ఆఫీసర్లను నియమించుకునేందుకు రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారన్నారు. వీరితో పాటు క్లస్టర్‌కు సైతం ఒక నోడల్ ఆఫీస‌ర్‌ను నియమించ నున్నట్లు తెలిపారు.ఆగస్టు 15 నుంచి తొలిమెట్టు పేరుతో ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం ప్రారంభం కానున్న‌దన్నారు.ఈ ఎఫ్ఎల్ఎన్ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణను విజయవంతం చేసేందుకు మండల విద్యాధికారులు చర్యలు చేపట్టాలన్నారు.మండల పరిధిలోని సీనియర్ ప్రధానోపాధ్యాయుల జాబితాను సమర్పించాలన్నారు.తమ పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షించి పాఠశాలను చేయాలన్నారు.మండలాలకు చేరిన ఏకరూప దుస్తుల వస్త్రాలను వెంటనే మహిళా సంఘాలకు 70 శాతం, స్థానిక టైలర్లకు 30 శాతం వస్త్రాలను అందజేసి ఆగస్టు 15లోగా విద్యార్థులందరికీ ఏరూప దుస్తులు అందేలా చర్యలు చేపట్టాలన్నారు.
మధ్యాహ్నం భోజనం పర్యవేక్షణతో పాటు, పాఠశాలలలో సర్దుబాటులో భాగంగా ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు వెళ్లేందుకు ఇచ్చిన ఆదేశాలను అమలు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.ఈ సమావేశంలో సెక్టోరల్ అధికారి బరపటి వెంకటయ్య, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు శెట్టి మండల విద్యాధికారులు పాల్గొన్నారు.
Attachments area