తొలుత లాభాలు..అంతలోనే నష్టాలు

మార్కెట్లపై ప్రతికూల ప్రభావం

ముంబయి,జూన్‌4(జ‌నం సాక్షి ): అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు తర్వాత నష్టాల్లోకి జారిపోయాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగాల షేర్లు డీలా పడటంతో సూచీలు భారీగా నష్టపోయాయి. నేటి నుంచి ప్రారంభమైన ఆర్‌బీఐ విధాన పరపతి సవిూక్షపై మదుపర్లు దృష్టిపెట్టడంతో మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈసారి ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో మార్కెట్లు నష్టపోయాయి. ఉదయం సెన్సెక్స్‌ 200 పాయింట్లకు పైగా లాభంతో మొదలవగా.. నిప్టీ 10,750 పైన ట్రేడింగ్‌ ప్రారంభించింది. అయితే ఆ జోరును సూచీలుఎంతో సేపు నిలుపుకోలేకపోయాయి. చివరికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 215.73 పాయింట్ల నష్టపోయి 35,011.89పాయింట్లకు చేరింది. నిప్టీ 67.70 పాయింట్ల నష్టంతో 10,628.50 పాయింట్ల వద్ద ముగిసింది.ట్రేడింగ్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఐడియా సెల్యూలార్‌, ఇన్ఫోసిస్‌, ఎం అండ్‌ ఎం, హిందాల్కో తదితర కంపెనీలు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, భారతీ ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ్గ/నాన్షియల్‌ సర్వీస్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ తదితర కంపెనీల షేర్లు నష్టాల పాలయ్యాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.12 వద్ద ట్రేడవుతోంది.