త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ గన్నోజు సునీత శ్రీ కృష్ణ చారి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్17(జనంసాక్షి):

తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండల పరిధిలోని మారెడు మాన్ దిన్నె గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర సర్పంచ్ గన్నోజు సునిత శ్రీకృష్ణచారి త్రీవర్ణ పతకంను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఆదేశాల మేరకు ఆనాటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యను చేపట్టి నిజాం నవాబు ఖాసీం రజ్వి ని సైనిక చర్యతో నిర్బంధించడం ద్వారా,నిజాం నవాబు ఖాసీం రజ్వి మన భారతదేశ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ కు తలవంచి ఆనాడు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని వీలిన ప్రక్రియను చేపట్టడం జరిగిందని అన్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంగమ్మ అమృనాయక్ , గ్రామ సెక్రటరీ సల్లేశ్వరం , 1 వార్డు మెంబరు శివ , 2 వార్డు మెంబరు లక్ష్మీ శ్రీశైలం, 6 వార్డు మెంబరు బేబీ సీతారాం , 7 వార్డు మెంబరు లక్ష్మీ నిరంజన్ , కో ఆప్షన్ సభ్యుడు వంకేశ్వరం నారాయణ , అంగన్వాడి టీచర్ గన్నోజు అలివేలమ్మ , వేడుక రావు పల్లి తాండా విద్య కమిటీ చైర్మన్ శ్రీను నాయక్, యాదవ సంఘం అధ్యక్షుడు శంకర్ యాదవ్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.