త్వరలో అత్యాచారాల నిరోధానికి కొత్త చట్టం

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ
పశ్చిమబెంగాల్‌ ,మార్చి 16 (జనంసాక్షి) :
అత్యాచారాలను నివారించేందుకు త్వరలో కొత్తం చట్టం తీసుకురానున్నట్లు యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ తెలిపారు. పశ్చిమబెంగాల్‌లోని మల్దా జిల్లా నారా యణ్‌పూర్‌లో ఘనీఖాన్‌ చౌదరి ఇనిస్టి ట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళల కోసం, వారి హక్కుల పరిరక్షణ కోసం యూపీఏ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుం దన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేం దుకు రూ. 1,000 కోట్లతో బ్యాంక్‌ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామ న్నారు. ఇదికాక రూ. 1,000 కోట్లతో నిర్భయ అనే నిధిని కూడా ఏర్పాటు చేస్తామని, ఈ నిధిని తల్లులు, సోదరీ మణుల గౌరవాన్ని, పరువును రక్షిం చేందుకు ఉపయోగిస్తామని తెలిపారు. నిరుపేదల కోసం ఆహార భద్రతా బిల్లు ఆమోదం పొందేలా కృషి చేస్తామని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పాల్గొన్నారు.