దండారి ఉత్సవాలలో పాల్గొన్న ఎస్ఐ మహేందర్.
నెరడిగొండఅక్టోబర్23(జనంసాక్షి) : మండలంలోని మాదాపూర్ గ్రామంలో గుస్సాడీ దండారి ఉత్సవాల సంబరాల్లో నెరడిగొండ ఎస్ఐ మహేందర్ తోపాటు వాగ్దారి గ్రామ సర్పంచ్ నాయకుడు గుమ్ముల మురళి పాల్గొని ఆదివాసుల సంస్కృతి సంప్రదాయలతో ప్రత్యేక పూజలు చేశారు.ముందుగా వారికి డోలు వాయిద్యాలతో స్వాగతం పలికి శాలువతో సత్కరించారు.గుస్సాడీ టోపీలు ధరించడం వల్ల సంస్కృతి ఉట్టిపడేలా కనిపించాయి.ఆదివారం రోజున దండారి ఉత్సవాలలో ఎస్ఐ.మహేందర్ మాట్లాడుతూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తు పర్యావరణ హితకరమైన పద్దతిలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే విదంగా దీపావళి పండుగ సంబరాలను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ తోపాటు సర్పంచ్ ఉప సర్పంచ్ దేవారి మోహన్ రావు పట్టెలు బండు ఆనంద్ రావు మహాజన్ బాదిరావు నాయకులు సంబన్న అమృత్ రావు గ్రామ ఆదివాసీ గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సంతృప్తి వ్యక్తం చేశారు.