దక్షిణేశ్వర ఆలయంలో అన్నదానం …..

భువనగిరి టౌన్ (జనం సాక్షి):– పార్వతీ సమేత దక్షిణేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి శాశ్వతంగా వేద మంత్రాల పారాయణాలు పంచామృత అభిషేకాలు నవాభిషేకాలు అన్నాభిషేకాలు స్వామివారికి ప్రత్యేకమైన అలంకారం చేసి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రతి సోమవారం లాగే ఈ సోమవారం కూడా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ రత్నాపురం శ్రీశైలం గారు మాట్లాడుతూ శ్రావణమాసంలో రెండవ సోమవారం సందర్భంగా స్వామివారికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించాము భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని రకాల ఏర్పాట్లను నిర్వహించాము భక్తులు ఇంకా పెద్ద ఎత్తున ఆలయాన్ని వచ్చి స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని భక్తులు కోరిన కోరికలను దక్షిణేశ్వర స్వామి నెరవేర్చాలని అదేవిధంగా ఆలయంలో శ్రావణమాసంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి పూజలో నిమగ్నములు కావాలని కోరుకుంటూ మాట్లాడడం జరిగింది కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆలయ పూజారి గోవర్ధన్ పంతులు ఆలయ ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్ ఉపాధ్యక్షులు మౌలికర్ కిషన్ స్వామి గారి బాలకిషన్ వెంకటేష్ గమహేష్ బాలు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఓం శ్రీ దక్షిణేశ్వరాయ నమః నమః