దడ పుట్టిస్తున్న కోడి గుడ్ల ధర
ఖమ్మం, అక్టోబర్ 8 : పట్టణంలో కోడిగుడ్ల ధర దడ పుట్టిస్తోంది. వీటి ధర కొండెక్కింది. హొల్‌సెల్‌గా గుడ్డు ధర రూ. 4-15పైసలకు చేరింది. గత ఏడాదితో పొల్చుకుంటే రెండు రూపాయలు ఉన్న గుడ్డు ధర 3, 3.30 కాగా ప్రస్తుతం 4.15కు చేరుకుంది. దీనితో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. గుడ్డు ధర బంగారమైంది. కొనాలంటే ఒకటికి రెండు మార్లు ఆలోచించుకోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీటి ధర 5రూపాయలకు అమ్మకాలు జరుగుతున్నాయి. తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు లభ్యమయ్యే గుడ్డు, అధిక ఖర్చుతో తక్కువ పోషకాలుగా మారిందని ప్రజలు వాపోతున్నారు.