దమ్ముంటే ఆధారాలు చూపించు

– అబ్దాలు ప్రచారం చేయడం బీజేపీ నేతలకు జబ్బుగా మారింది
– జీవీఎల్‌ ఆరోపణలపై ట్విట్టర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్‌
అమరావతి, జులై5(జ‌నం సాక్షి) : ఎన్డీఏకు తెలుగుదేశం గుడ్‌బై చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.. తాజాగా మంత్రి లోకేష్‌ వర్సెస్‌ బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుగా వార్‌ నడుస్తోంది. లోకేష్‌ ఎవరో కేంద్రమంత్రి దగ్గర లాబీయింగ్‌ కోసం ఓ వ్యక్తిని పంపారన్న ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు వ్యాఖ్యలు దుమారం రేపగా… ఈ విమర్శలకు సోషల్‌ విూడియా వేదికగా లోకేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. మనుషుల్లో రెండు రకాలుంటారని… నిజాలు చెప్పేవారు ఓ రకమైతే, అబద్ధాలను నిజంగా నమ్మించే వారు మరొకరు ఉంటారని, వీటిల్లో రెండో రకంకు చెందిన వ్యక్తి జీవీఎల్‌ నర్సింహారావు అంటూ ఘాటుగా లోకేష్‌ ట్వీట్‌ చేశారు. ఢిల్లీలో లాబీయింగ్‌ పేరుతో జీవీఎల్‌ మరో కట్టుకథకు తెరలేపారని మండిపడ్డారు లోకేశ్‌ మండిపడ్డారు. దమ్ముంటే తనకు ముడిపెట్టిన కేంద్రమంత్రి, బ్రోకర్‌ పేర్లు బయటపెట్టాలని ట్విట్టర్‌ వేదికగా మంత్రి లోకేష్‌ సవాల్‌ విసిరారు. అబద్ధాలను ప్రచారం చేయడమే బీజేపీ నేతలకు జబ్బుగా మారిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మరో ట్వీట్‌ చేసిన లోకేష్‌.. ఏపీకి ఇవ్వాల్సింది ఏవిూ లేదని, అంతా ఇచ్చేశామంటూ కేంద్రం అఫిడవిట్‌ సమర్పించి ఏపీ ప్రజలకు తీరని ద్రోహం చేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రజల వెన్ను విరిస్తే… బీజేపీ వాళ్ల నమ్మకాన్ని విరిచేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీని మర్చిపోరని, వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే పనిలో తాను ఉన్నానని తెలిపారు. శాఖాపర పనుల్లో బిజీగా ఉన్న తనకు జీవీఎల్‌ చేసిన అసత్య ఆరోపణలపై స్పందించడానికి 36గంటలు పట్టిందని, పేర్లు బయటపెట్టడానికి ఖాళీగా ఉన్న జీవీఎల్‌కు ఇంత సమయం పట్టడం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు. విూలో సృజనాత్మకత తగ్గిపోయిందా? అని జీవీఎల్‌ను లోకేశ్‌ ప్రశ్నించారు.