దమ్ముంటే కరెంటు నీటిపై చర్చకు రండి
టిఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరిన నాగం
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి జూలై 15 (జనం సాక్షి)
దమ్ముంటే నీరు , కరెంటు సరఫరా పై బి ఆర్ ఎస్ నాయకులు చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. శనివారం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏ సభలలో మూడు గంటల కరెంటు సరిపోతుందని చెప్పలేదని ఆయన అన్నారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విద్యుత్తు ఇవ్వాలని మాత్రమే చెప్పారని , బి ఆర్ఎస్ నాయకులు మాటలు వక్రీకరిస్తూ గగ్గోలు పెడుతున్నారని ఆయన అన్నారు. మీకు చేతనైతే చర్చకు రండి సబ్ స్టేషన్ లో ఉన్న లాంగ్ బుక్కులను ముందు పెట్టుకొని బహిరంగ చర్చించుకుందాం అని ఆయన తెలిపారు. పాలమూరు రంగారెడ్డి నీటిపారుదల ఎత్తిపోతల ప్రాజెక్టును చేతకాని ఈ దద్దమ్మలు తాగునీటి ప్రాజెక్టుగా మార్చారని వారు ఆరోపించారు. జాతీయ ట్రిబ్యునల్ కోర్టులో అడుక్కొని పిటిషన్ వేయడం ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం కాదా అని వారు ప్రశ్నించారు. ఆంధ్ర వాళ్లతో కుమ్మకై కృష్ణానది నీటిని అక్రమంగా తోడుకొని పోతున్న ఎందుకు అడ్డుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు .
మీ పాలనలో ఎన్ని సబ్ స్టేషన్ కట్టారు ఎన్ని రిజర్వాయర్లు నిర్మించారు చెప్పాలన్నారు . కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత కరెంటును ఎందుకు కట్ చేశారని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్తుకు పేటెంట్ హక్కు అని వచ్చే పార్టీ పాలనలో రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ బెనహర్, అనిత లక్ష్మణ్ యాదవ్ ,సిరాజ్ కాద్రి తదితరులు పాల్గొన్నారు.