దరఖాస్తు చేసుకున్న ప్రతి జర్నలిస్టు కు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయిస్తాం
జనం సాక్షి:-
ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి జర్నలిస్టుకు డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రభుత్వ నిబంధనల మేరకు కేటాయిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జర్నలిస్ట్ లకు డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా నాయకులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు నూకపల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల లో జర్నలిస్టులకు ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కు డబుల్ బెడ్ రూం ఇండ్లు వీలైనంత తొందరగా మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధ్యావర సంజీవ రాజు, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు నల్లాల జయపాల్, గుర్రం చంద్రశేఖర్, జిల్లా నాయకులు తిరునగరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.