దర్గా లో ఘనంగా వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు
కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్ జన్మదినం సందర్బంగా కరీంనగర్ లోని కరీముల్లాషా దర్గాలో షేక్ యూసుఫ్ అధ్వర్యం లో దర్గా లో చాధర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా నగర మేయర్ సునిల్ రావు పాల్గొన్నారు.సునిల్ రావు మాట్లాడుతూ బోయినిపల్లి వినోద్ కుమార్ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని వారు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ , భవిష్యత్తు లో మరెన్నో ఉన్నత పదవులు పొంది తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సులేమాన్ తవక్కలీ,పొన్నం అనిల్,సంపత్,మాజీద్,అస్మత్ అలీ బేగ్,షేక్ నభీ,సయ్యద్ సాజిద్,ఇస్తాక్ అహ్మద్,అహ్మద్,కదీర్ షా ఖాన్,బాబా,ఇర్ఫాన్ ఉల్ హఖ్,అఫ్జల్ ,
మహమూద్,కులదీప్,రాజు తదితరులు పాల్గన్నారు.