దళితులను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకే దళిత బందు

 

-అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్ వి.యం అబ్రహం

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 28 : దళితులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకే దళిత బందు పథకమని అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం అన్నారు. ఆదివారం మండల పరిధిలోని వల్లూరు గ్రామంలో దళిత బందు పథకం కింద లబ్ధిదారుడు టీ. జమన్నకు మంజూరైన గార్మెంట్స్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అబ్రహం హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి దళిత బందు పథకం దళిత జాతి కుటుంబాల అభ్యున్నతికి ఆర్థిక ఎదుగుదలకు ఒక గొప్ప వరమన్నారు. కెసిఆర్ గొప్ప ఆలోచనతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఎన్నో దశాబ్దాలుగా దళిత జాతి కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి పరంగా అణిచివేతకు గురవుతున్న కారణంతో సమాజంలో వాళ్లు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని దృఢ సంకల్పంతో ముందుచూపుతో ఆలోచన చేసి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం అందేలా అమలు చేసేవిదంగా కార్యాచరణ రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి, సింగల్ విండో చైర్మన్ ఇ. రంగారెడ్డి వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వేణుగోపాల్ నాయుడు, ఎల్కూరు శీను, ప్రభుదాస్, గిడ్డారెడ్డి ప్రజాప్రతి నిధులు మరియు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.