దళితులను పరామర్శించడంను అడ్డుకోవడం సిగ్గుచేటు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాసాడ నర్సింగ్
పోలీసుల నిర్బంధంలో కాంగ్రెస్ నాయకులు
ఎడపల్లి, జూలై 31 ( జనంసాక్షి ) : సిరిసిల్ల లో ఇసుక మాఫియాకు బలై పోయిన దళితులను పరామర్శించేందుకు వెళ్లే కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడం సిగ్గుచేటని ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాసాడ నర్సింగ్ ముదిరాజ్ ఆరోపించారు. సోమవారం సిరిసిల్లకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను ఎడపల్లి ఎస్ఐ ఎండీ ఆసిఫ్ అడ్డుకొని స్టేషన్లో ఉంచారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాసాడ నర్సింగ్ ముదిరాజ్ మాట్లాడుతూ, సిరిసిల్లలో ఇసుక మాఫియా రెచ్చిపోయి స్థానిక దళితులపై అకారణంగా దాడి చేయడంతో ఎంతో మంది తీవ్ర గాయాలుపాలు అయ్యారని ఆయన అన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన సర్కారు మాఫీయాకు వత్తాసు పలకడం సిగ్గుచేటని ఆరోపించారు. దళితులను రక్షించాల్సిన సర్కారు వారిపై సవతి ప్రేమ చూపించడం దూరదృష్టకరమన్నారు. ఈ విషయంలో దళితులను పరామర్శించేందుకు వెళ్తున్న మీరాకుమార్ తో పాటు కాంగ్రెస్ పెద్దలను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వసం పోయిందని, దాంతోనే ఇలా కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ సర్కారు హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేకతకు రానున్న రోజుల్లో పతనం తప్పదని యాసాడ నర్సింగ్ ముదిరాజ్ హెచ్చరించారు. పోలీసుల అదుపులో ఉన్నవారిలో అంబం సర్పంచ్ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు ఎల్లయ్య యాదవ్, కిషన్ గౌడ్, పెరిక లక్ష్మణ్, జావీద్, మాజీ ఎంపీపీ గైని పోచయ్య, కల్కి సంతోష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫరాన్ లు పాల్గొన్నారు.