దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపి దళితుల అభ్యున్నతకు కృషి

ఇటిక్యాల (జనంసాక్షి) జులై 26 : సామాజిక, ఆర్థిక రంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపి దళితుల అభ్యున్నతకు కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని అలంపూర్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ వి.ఎం అబ్రహం అన్నారు. మంగళవారం మండలం పరిధిలోని కొండేరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బందు పథకం పొందిన లబ్ధిదారి పద్మ ఆధ్వర్యంలో నూతన బట్టల షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అబ్రహం హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తరతరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న దళితల సమాజాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అణిచివేయబడ్డ దళితుల జీవితాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన వెలుగులు నింపుతుందన్నారు. దళిత బంధు పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధించి తద్వారా సమాజంలో ఉన్నతులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం అమ‌లు చేయడం జరిగింది అని అన్నారు. గ‌తంలో ఇచ్చిన హమీల‌ను ఒక్కోక్క‌టిగా నెర‌వేరుస్తున్నార‌ని, ద‌ళిత బంధు పథకంలో దళితులను ఎంపిక చేసి
ఒక్కో లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లో మధ్యవర్తులు, ఇతర ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా నేరుగా రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా జమచేస్తున్నార‌ని ఆయన పేర్కొన్నారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతావ‌నిలో ద‌ళిత వాడ‌లు ఇంకా అలాగే ఉన్నాయని, అయితే వారి జీవితాల్లో పెద్ద‌గా మార్పు రాలేద‌న్నారు. కానీ తెలంగాణ ప్ర‌భుత్వం బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేమం కోసం ఎన్నో ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ హనుమంతు రెడ్డి, సింగల్ విండో చైర్మన్ రంగారెడ్డి, స్థానిక సర్పంచ్ వీరన్న, రైతు సమన్వయ అధ్యక్షుడు గిడ్డారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, జింకలపల్లి సర్పంచ్ ఈదన్న, కోదండపురం సర్పంచ్ సుంకన్న,ధర్మవరం సర్పంచ్ మధు నాయుడు, తెరాస నాయకులు ఎల్కూర్ శ్రీను, మల్లన్న, తిమ్మపురం శివుడు, బట్లదిన్నే సుంకన్న , బీచుపల్లి అలయ ధర్మకర్త కృష్ణ ,ప్రభుదాసు, రాగన్న, తదితరులు పాల్గొన్నారు.