దళితుల ఆర్థిక అభివృద్ధి సాధనకే దళిత బంధు…..ఎమ్మేల్యే డా. సంజయ్
జగిత్యాల అర్బన్ మండల అంబారీ పెట్ గ్రామానికి చెందిన మల్యాల గంగాధర్ గారికి దళిత బంధు పథకం ద్వారా మంజూరైన అశోక్ లేలండ్ గూడ్స్ వాహనాన్ని అందజేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.
ఎమ్మేల్యే మాట్లాడుతూ
దళిత బందు చాలా గొప్ప కార్యక్రమం అని,తర తరాలుగా దళిత బిడ్డలు వివక్ష కు గురి అయ్యారు అని, నేడు ముఖ్యమంత్రి గారు దళితులు ఆర్థిక సామాజిక అభివృద్ది కోసం ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారని,ఎలాంటి బ్యాంక్ అప్రూవ్ లేకుండా డైరెక్ట్ గా దళిత బిడ్డల ఖాతాల్లో 10లక్షలు జమ చేయడం జరిగింది అని దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా లేదని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బెక్కెంశ్రీనివాస్,శేకర్,లక్ష్మన్,చిన్నలక్ష్మణ్,నారపాక గంగాధర్,తిరుపతి,కొలపక రాజేష్,మోహన్,తదితరులు పాల్గొన్నారు.