దళితుల జీవితాల్లో వెలుగులు నింపాల న్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ సంకల్పం.

ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.
దళితబంధు పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన 19 యూనిట్లను అందచేసిన ఎమ్మెల్యే,జడ్పీ చైర్మన్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై25(జనంసాక్షి):
దళితుల జీవితాల్లో వెలుగులు నింపాల న్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ సంకల్పం అని కొల్లాపూర్ ఎంఎల్ఏ బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.సోమవారం కొల్లాపూర్ ఆర్డీవో కార్యాలయంలో దళితబంధు పథకం కింద లబ్ధిదారులకు మంజూరు అయిన 19 యూనిట్లను ఎమ్మెల్యే బీరం జడ్పీ చైర్మన్ పద్మావతి  పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ…దళితబంధు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ కు మానస పుత్రిక అని అన్నారు.దళితులను ఆర్థికంగా సుసంపన్నం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని అన్నారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగు తుందన్నారు.రాష్రంలో ప్రజలు ఏమి కోరు కుంటున్నారో పాలకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అదే అమలు పరుస్తున్నారని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పధకం కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిందేనని అని ఆయన తెలిపారు.వాహనాలు పొందిన లబ్ధిదారులు ప్రయాణంలో జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు.అనంతరం ఎమ్మెల్యే  దళితబంధు లబ్ధిదారులతో కలిసి  బాబు జగ్జీవన్ రావ్ విగ్రహానికి పూలమాల వేసి ట్రాక్టర్ నడుపుతూ   అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి వచ్చి మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.నేడు వందమంది లబ్ధిదారులకు దళిత బంధు ఇచ్చామని త్వరలో 15వందల నుంచి 2వేల మంది లబ్ధిదారులకు ఇస్తామని ఈసందర్భంగా ఎమ్మెల్యే  అన్నారు‌ఇప్పుడు దళితబంధు పథకం ద్వారా తీసుకున్న ట్రాక్టర్ లు, డైరీ యూనిట్స్, కారు డిజె సిస్టం తీసుకున్న లబ్ధిదారులు అందరు ఈ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని జీవితంలో వృద్ధి చెందాలని ఎమ్మెల్యే బీరు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.