దళితుల పై అక్రమ కేసులు పెట్టినా నారాయణఖేడ్ డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలి
జహీరాబాద్ అక్టోబర్ 21 (జనంసాక్షి)అంబేద్కర్ జెండాను అవమానించిన ఆగ్రకుల పెత్తందారులను వదిలి బాధిత దళితులపైన అక్రమ కేసులు పెట్టిన డిఎస్పీ ని సస్పెండ్ చేయాలని
సమతా సైనిక దళ్ జిల్లా అధ్యక్షుడు బల్ రాజ్ డిమాండ్ చేశారు. శుక్రవారం సమతా సైనిక దళ్-దళిత సంఘాలు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అంబేద్కర్ జెండాను అవమానించిన అగ్రకుల పెత్తందారులను వదిలి బాధిత దళితులపైన అక్రమ కేసులు పెడతారా, దళితులపై అక్రమ కేసులు పెట్టిన నారాయణఖేడ్ డిఎస్పిని వెంటనే సస్పెండ్ చేయాలని, దళితులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని, అంబేద్కర్ జెండాను అవమానించిన అగ్రకుల పెత్తందారులను వెంటనే అరెస్టు చేయాలని సమతా సైనిక దళ్, దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సమతా సైనిక్ దళ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బాలరాజు, రాయికోడ్ మండల్ కాంగ్రెస్ యువ నాయకులు చరణ్, కెవిపిఎస్ మొగుడంపల్లి మండల అధ్యక్షులు మహేష్, స్వేరో నాయకులు ప్రతాప్ మాట్లాడుతూ
కంగ్టి మండలం ఏన్కేమూరి గ్రామంలో ఈనెల 5న దసరా పండుగ రోజున భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అంబేద్కర్ ఫోటోతో ఉన్న జెండాను కొంత మంది అగ్రకుల పెత్తందారులు అవమానించారనీ, మరుసటి రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో జెండాను అవమానించిన పెత్తందారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించడం జరిగిందని అన్నారు. విచారణ పేరుతో కాలయాపన చేయడం తప్ప అంబేద్కర్ జెండాను తొలగించి అవమానించిన పెత్తందారులను ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం దారుణమని అన్నారు.. అంబేద్కర్ జెండాను తొలగించి అవమానించేటపుడు అక్కడున్న దళితులు ఎందుకు తొలగిస్తున్నారాని పెత్తందారులను ప్రశ్నించినందుకు 8 మంది దళితులపై అక్రమ కేసులు పెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దళితులపై కేసు
ఈ సమావేశంలో సమతా సైనిక్ దళ్ నాయకులు మోహన్, గోవర్ధన్, రాజు, బాలు, నరేష్, ధనరాజ్, దిలీప్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.