-->

దళిత ఆత్మీయ సమ్మేళనం,వనభోజాన కార్యక్రమం

నాంపల్లి సెప్టెంబర్ 28 (జనం సాక్షి )
టి ఆర్ ఎస్ పార్టీ దళిత ఆత్మీయ సమ్మేళనం, వనభోజనం మండలంలో ఏర్పాటు చేశారు. గురువారం నాంపల్లి మండలం లోని పలు గ్రామాలలో నాంపల్లి, మాందాపురం, మల్లపు రాజు పల్లి, మెల్లవాయి,సుంకిశాల గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ దళిత ఆత్మీయ సమ్మేళనం వనభోజన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా టి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షుడు,దేవరకొండ శాసన సభ్యుడు రమావత్ రవీందర్ కుమార్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు అన్నిట్లో పెద్దపీట వేస్తుందని, కళ్యాణ లక్ష్మి పథకం మొదటిగా దళితులకె ఇచ్చిందని, దళితులు పేదరికంలో మునగకుండా లలిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయల సాయం ప్రభుత్వం అందజేస్తుందనిన్నారు. దీనిని అందరు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. మునుగోడు నియోజకవర్గంలో త్వరలో 1500 మంది లబ్ధిదారులకు దళిత బందు వస్తుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో ఎం ఎల్ సి ఎం సి కోటిరెడ్డి, ఎంపీపీ శ్వేతా రవీందర్ రెడ్డి, జెడ్ పి టి సి వెలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి , వైస్ ఎంపీపీ పానగంటి రజిని వెంకన్న గౌడ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి, సర్పంచులు సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మునగాల సుధాకర్ రెడ్డి, బాషి పాక రాములు, గుండెబోయిన మైవమ్మ, బత్తుల వంశీ, నాంపల్లి సత్తయ్య, బెల్డి సత్తయ్య, గాదేపాక రమేష్, ఈద శేఖర్,ఇట్టం వెంకట్ రెడ్డి, టి శ్రీ రాం రెడ్డి, యాదగిరి రెడ్డి, ఈదయ్య తదితరులు పాల్గొన్నారు.