దళిత కుటుంబాలను పరామర్శించిన రాహుల్‌

5

అహ్మదాబాద్‌,జులై 21(జనంసాక్షి):గుజరాత్‌లో దళితులపై దాడి ఘటనలో బాధిత కుటుంబాలను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గురువారం పరామర్శించారు. ఉనా వెళ్లిన ఆయన బాధితులతో మాట్లాడారు. చనిపోయిన ఆవుల చర్మాన్ని తరలిస్తున్నారన్న ఆరోపణలతో గుజరాత్‌లోని ఉనా జిల్లాలో నలుగురు యువకులపై గో సంరక్షణ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. యువకులను దుస్తులు విప్పేసి.. ఓ కారుకు కట్టేసి చితకబాదారు. ఈ ఘటన పట్ల గుజరాత్‌లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. దళితులు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బంద్‌లు చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ పటేల్‌ బుధవారం ఉనా వెళ్లి బాధితులను పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హావిూ ఇచ్చారు. మరోవైపు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ కూడా శుక్రవారం గుజరాత్‌ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ పర్యటన సాగింది. బుధవారం పార్లమెంటులో చర్చ సందర్భంగా రాహుల్‌ మంచి నిద్రలో ఉన్నారు. దీనిపై మాయావతి మండిపడ్డారు. నిద్రపోతున్న వారు దళితులకు ఏం న్యాయం చేస్తారని అన్నారు.