దళిత జర్నలిస్టులందరికీ దళిత బంధు అమలు చేయాలి.
దళిత జర్నలిస్టులందరికీ దళిత బంధు అమలు చేయాలి.
ప్రతినెల గౌరవ వేతనం ఇవ్వాలి.
దళిత జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్.
డి జె ఎఫ్ బలోపేతన్నానికి కృషి చేయాలి.
నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు పి. వెంకటస్వామి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్8(జనంసాక్షి) :
దళిత జర్నలిస్టు లందరికీ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని దళిత జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్ లో నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు పంగిడి చెరువు వెంకటస్వామి అధ్యక్షతన దళిత జర్నలిస్టు ల ఫోరం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమా నికి రాష్ట్ర దళిత జర్నలిస్టుల ఫోరం వ్యవ స్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్
ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులు ఆత్మగౌరవంతో సమాజంలో నిలబడాలని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అందులో భాగంగానే దళిత బంధు కూడా అమల్లోకి తెచ్చిందని అన్నారు.వేతనం లేని జీవితాలను గడుపుతున్న దళిత జర్నలిస్టు లకు ప్రతి నెలా గౌరవ వేతనం ఇచ్చే విధంగా అసెంబ్లీలో ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.అంతేకాకుండా విలేకరి వృత్తిలో ఉంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వృత్తినే దైవంగా భావించి విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొని వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు.దళిత జర్నలిస్టులు వృత్తిపరంగా ఎలాంటి సమష్యలైనా ఎదురైనా మా దృష్టికి తీసుకురావాలని, వాటిని తప్పకుండా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవుట శ్రీనివాస్,రాష్ట్ర కార్యదర్శి శేఖర్, అనిల్,సీనియర్ రిపోర్టర్ దామోదర్,ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు పట్టాభి,నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్,గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంకటన్న,నాగర్ కర్నూల్ ఉపాధ్యక్షుడు ఆవుట వెంకటేష్, కల్వకుర్తి మండల అధ్యక్షుడు నరేష్ లు జర్నలిస్టులు మాట్లాడుతూ కత్తి కన్నా బలమైన ఆయుధం కలం అని ఆ ఆయుధమే మనకు దారి చూపుతుందని స్పష్టం చేశారు.దేనికి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని తప్పకుండా వృత్తిలో నిజాయితీగా ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలని ఈ సందర్భంగా వారు సూచించారు.
డి జె ఎఫ్ బలోపేతన్నానికి కృషి చేయాలి:
నాగర్ కర్నూల్ డి జె ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి వెంకటస్వామి.
ప్రతి దళిత జర్నలిస్టు దళిత జర్నలిస్టు ఫోరం యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని నాగర్ ర్నూల్ జిల్లా డి జే ఎఫ్ అధ్యక్షులు పి.వెంకటస్వామి వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంతవరకు డీజే ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు.డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కార్పోరేట్ స్థాయిలో వైద్యం అందించే విధంగా హెల్త్ కార్డులు,అర్హులైన ప్రతి దళిత జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు, అక్రిడేషన్ తో సంబంధం లేకుండా ప్రతి జర్నలిస్టుకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న దళిత జర్నలిస్టులు, అన్ని తాలుకాల,మండలాల అధ్యక్షులు మరియు వివిధ మండలాల్లో పనిచేస్తున్న దళిత జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.