దళిత విద్యార్థి కుటుంబాన్నిపరామర్శిస్తే భయమెందుకు
టిడిపి నేతలను అడ్డుకోవడంలో ఆంతర్యమేమిటి: టిడిపి
అమరావతి,ఆగస్ట్18(జనంసాక్షి): రాష్ట్రంలో దళితయువతి అమానుషంగా నడిరోడ్డుపై చంపితేఆ కుటుంబాన్ని పరామర్శించడం కూడా ప్రభుత్వం తట్టుకోలేక పోయిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు వైసీపీ ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థిని రమ్యశ్రీ మృతదేహాన్ని చూడటానికి వెళ్లిన నారా లోకేష్, టీడీపీ నేతలను వైసీపీ రౌడీమూకలు ఎందుకు అడ్డుకున్నాయని ప్రశ్నించారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ఇంతకన్నా దారుణం ఉంటుందా అన్నారు. మృతురాలి కుటుంబసభ్యులతో లోకేష్ మాట్లాడకుండా, వారిని డీఎస్పీ ఎందుకు తన కారులో తీసుకెళ్లారని మాణిక్యరావు నిలదీశారు. లోకేష్ బయటకు వస్తున్నారంటే ముఖ్యమంత్రి జగన్, మంత్రులు తడుపుకుంటున్నారన్నారు. లోకేష్‌ను ఆపడం వైసీపీ రౌడీమూకలు, పోలీసులు వల్లకాదన్నారు. దళితులపై అత్యాచారాలు, దాడులు, హత్యలు, వేధింపులు జరిగినప్పుడు మేరుగ నాగార్జున, నందిగం సురేశ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. చీరాలలో కిరణ్ కుమార్‌ను కొట్టి చంపినప్పుడు, దళిత మహిళ నాగమ్మను అత్యాచారం చేసి హత్య చేసినప్పుడు నాగార్జున ఎక్కడ పడుకున్నాడని పిల్లి మాణిక్యరావు నిలదీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పాలనపై రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని అతి తక్కువ కాలంలో రాష్ట్ర ప్రజలు వద్ద వ్యతిరేకత తెచ్చుకున్న ఘనత జగన్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. జగన్ పరిపాలన అన్ని వర్గాలలో అసంతృప్తి చోటుచేసుకుందని ఆయన అన్నారు. గడిచిన రెండు సంవత్సరాల పాలనలో కక్ష్య సాధింపు చర్యలకే జగన్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ఆయన విమర్శించారు.