దాతల సహాయం అభినందనీయం

తిరుమలగిరి (సాగర్ )జూలై 20 (జనంసాక్షి):
దాతల సహాయం అభినందనీయమని అల్వాల సర్పంచ్ పెంకిసు పాపిరెడ్డి అన్నారు. అల్వాల ప్రాథమికోన్నత పాఠశాల లో బుధవారం, మిర్యాలగూడలో అసిస్టెంట్ ఇంజినీర్ గా పనిచేస్తున్న భరత్ రెడ్డి డోనేట్ చేసిన నోటు పుస్తకాలను ఆయన,రిటైర్డ్ ఉపాధ్యాయులు పల్రెడ్డి నర్సింహా రెడ్డి తో కలిసి విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తూమురుగోటి జ్యోతి సీనియర్ ఉపాధ్యాయులు రాపోలు పరమేష్,పాపని బాలకృష్ణ,లింగమ్మ,వాలంటీర్స్ లావణ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.