దిల్లీ ఎన్నికలు ప్రశాంతం

4

67 శాతం ఓటింగ్‌

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జనంసాక్షి): దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సాయంత్రం 6గంటలకు ముగిసింది. 67.5శాతం పోలింగ్‌ నమోదైంది. పోటీలో 673 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోలింగ్‌ సందర్భంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 714 సమస్యాత్మక, 191 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఈ నెల 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ, భాజపా సీఎం అభ్యర్థి కిరణ్‌ బేడీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులు  తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ప్రాంభమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, నిర్మాణ్‌భవన్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఔరంగజేబ్‌ లేన్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్‌ బేడీ శనివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఆమె నీతి బాగ్లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. అలాగే ఉప రాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌, మాజీమంత్రి హర్షవర్థన్‌, రాష్ట్రపతి కుమార్తె శర్మిష్ట ముఖర్జీ తదితరులు ఓటు వేశారు. కాగా శర్మిష్ట గ్రేటర్‌ కౌలాష్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఓటు హక్కును వినియోగించు కున్న అనంతరం ఆమె…తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన మోడల్‌ పోలింగ్‌ స్టేషన్లో పర్యటించిన ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.  ప్రముఖులు ఒక్కొక్కరుగా ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు వస్తున్నారు. ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ బీకే దత్‌ కాలనీలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు పెద్దసంఖ్యలో తరలిరావాలని ప్రధాని నరేంద్ర మోదీ యువతకు పిలుపు నిచ్చారు. ఈ ఎన్నికల్లో రికార్డుస్థాయి ఓటింగ్‌ నమోదు కావాలని కోరారు. దిల్లీ శాసనసభ ఎన్నికల్లో భాజపా తప్పక విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ ధీమా వ్యక్తం చేశారు. దిల్లీలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని, ముఖ్యమంత్రి పదవిని కిరణ్‌బేడీ చేపడతారని అన్నారు