దివాలా తీశాం ఆదుకోండి

2

జీతాలకే డబ్బులు లేవు

కేంద్రానికి చంద్రబాబు వేడుకోలు

హైదరాబాద్‌,జనవరి27(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాలని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోరారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జీతాలకే డబ్బు సరిపోవడం లేదని, ఇంకా రాజధాని నిర్మంచుకోవాల్సి ఉందని, విభజన చట్టంద్వారా తమకు రావాల్సిన సౌకర్యాలను కల్పించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఆంధప్రదేశ్‌లో పెట్టుబడుల కోసమే దావోస్‌ వెళ్లినట్టు చంద్రబాబు నాయుడు తెలిపారు. తన పర్యటన మంచి ఫలితాలుఇచ్చిందని అన్నారు. పలువరు ప్రముఖులను  కలుసుకునే అవకాశం వచ్చిందన్నారు. దావోస్‌ పర్యటనలో సాంకేతిక నిపుణులు, తయారీరంగ దిగ్గజాలను కలిసినట్లు చెప్పారు. వాల్‌మార్ట్‌ 5 అంశాల్లో సహకరిస్తామని చెప్పిందని, వ్యవసాయ ఉత్పత్తులు, డ్వాక్రా వస్తువులకు వాల్‌మార్ట్‌ ఇంటర్నేషనల్‌ బ్రాండింగ్‌ కల్పిస్తుందన్నారు. ఈ-గవర్నెన్స్‌లో విప్రోతో కలిసి జాయింట్‌ వెంచర్‌ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మార్చిలో శ్రీసిటీలో పెప్సికో యూనిట్‌ ఏర్పాటవుతుందని, నేచురల్‌ ఫడ్స్‌తో ఉత్పత్తులు తయారు చేయాలని పెప్సికోను కోరినట్లు చంద్రబాబు వెల్లడించారు. స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌కు ఇన్ఫోసిస్‌ సహకరిస్తుందన్నారు. పెట్టుబడుల గురించి ఇరువైపులా లాభం జరిగేలా ఒప్పందాలు ఉంటాయని అన్నారు.హిందుజా, ఇన్‌ ఫోసిస్‌ తదితర సంస్థల ప్రతినిదులను కలిశానని ఆయన అన్నారు. వారిలో పలువురు ఎపి పట్ల ఆసక్తి కనబరిచారని అన్నారు.ఆంధప్రదేశ్‌ లో చేపడుతున్న అభివృద్ది కారణంగా త్వరలో గేట్‌వే ఆఫ్‌ ఇండియా అవుతుందని  చంద్రబాబు

అన్నారు. మన దేశం పట్ల పెట్టుబడిదారులు సానుకూల ఆలోచనలో ఉన్నారన్నారు. డావోస్‌ లో జరిగిన ఆర్దిక సదస్సులో బారత్‌ కు విశేష ప్రాధాన్యత లబించిందని చంద్రబాబు నాయుడు చెప్పారు. అక్కడ సమావేశమైన వారంతా భారత్‌ పెట్టుబడులకు అనువైన ప్రదేశమని గుర్తించారని అన్నారు. స్థానిక పారిశ్రామికవేత్తలను తాను గతంలో కూడా ప్రోత్సహించానని, వారికి విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం వంటి వాటితో మరింత మెరుగ్గా అబివృద్ది చెందుతారని ఆయన అన్నారు.గత కాంగ్రెస్‌ తప్పుడు విధానాల వల్ల పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లవలసి వచ్చిందని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయి మళ్లీ మంచి ఇమేజీ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.అందుకే సింగపూర్‌ కు మన పారిశ్రామికవేత్తలను కూడా తీసుకు వెళ్లానని అన్నారు.గత కాంగ్రెస్‌ హయాంలో విదానాల లోపం, అవినీతి వల్ల చాలా నష్టం జరిగిందని ఆయన అన్నారు.మన వద్ద ప్రతిదానికి పాతిక లైసెన్సులు అవసరం అవుతున్నాయని,దీనివల్ల నష్టం జరుగుతోందని చంద్రబాబు అన్నారు.దీనికి పరిష్కారంగా సంస్కరణలు తెస్తామని అన్నారు. మన విధానాలకు మంచి స్పందన లభించిందని ఆయన అన్నారు. సహజ వనరులు, స్థిరమైన ప్రభుత్వం అంతర్జాతీయంగా మనకున్న ప్రధాన ఆకర్షణ అని వివరించారు. దావోస్‌ సదస్సకు అమెరికా తర్వాత ఎక్కువమంది ప్రతినిధులు మనదేశం నుంచి హాజరయ్యారన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయీ బిజినెస్‌లో మన దేశం 143వ స్థానంలో ఉందన్నారు. ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా గురించి కేంద్రాన్ని అడుగుతున్నామన్నారు. విద్యుత్‌ ఎ/-లాంట్స్‌ పెట్టాం… కానీ గ్యాస్‌ ఇవ్వలేదు. యూపీఏ విధాన లోపం వల్లే గ్యాస్‌ ఇవ్వలేదు, దాని వల్ల నష్టం జరిగిందన్నారు.  దావోస్‌ పర్యటనలో సాంకేతిక నిపుణులు, తయారీరంగ దిగ్గజాలను కలిసినట్లు చెప్పారు. వాల్‌మార్ట్‌ 5 అంశాల్లో సహకరిస్తామని చెప్పిందని, వ్యవసాయ ఉత్పత్తులు, డ్వాక్రా వస్తువులకు వాల్‌మార్ట్‌

ఇంటర్నేషనల్‌ బ్రాండింగ్‌ కల్పిస్తుందన్నారు. ఈ-గవర్నెన్స్‌లో విప్రోతో కలిసి జాయింట్‌ వెంచర్‌ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మార్చిలో శ్రీసిటీలో పెప్సికో యూనిట్‌ ఏర్పాటవుతుందని, నేచురల్‌ ఫడ్స్‌తో ఉత్పత్తులు తయారు చేయాలని పెప్సికోను కోరినట్లు చంద్రబాబు వెల్లడించారు. స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌కు ఇన్ఫోసిస్‌ సహకరిస్తుందన్నారు. ఎపికి ప్రత్యేక ¬దా వస్తే కేంద్రం ఇచ్చే పధకాలన్నిటికి తొంభై శాతం గ్రాంటుగా వస్తాయని చంద్రబాబు నాయుడు అన్నారు. తాను డిల్లీ పర్యటనలో ఈ విషయం గురించి ఆయా మంత్రులను కోరానని అన్నారు. ప్రత్యేక ¬దా పై మాట్లాడుతున్నామని అన్నారు. అయితే ¬దా రాకపోవడం వల్ల ఏమి నష్టం జరుగుతుందని అడిగినదానికి చంద్రబాబు నేరుగా సమాధానం చెప్పలేదు.  లోటు బడ్జెట్‌ ఉన్నా, కష్టాలు ఉన్నా వాటిని ఆత్మస్థయిర్యంతో ఎదుర్కొనపి ముందుకు సాగేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు ఇంట్లో కూర్చుంటే కష్టాలు తీరవన్నారు. 19 వేల కోట్ల లోటు వల్ల ఇబ్బదులు ఉన్న మాట వాస్తవమేనని , అయితే కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. ప్రజల్లో కూడా భరోసా నింపడానికి మళ్లీ తాను పాదయాత్ర చేశానని, ఆ తర్వాత డావోస్‌ వెళ్లానని ఆయన చెప్పారు.ప్రత్యేక ¬దా కోసం తమ వంతు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. భూ సవిూకరణకు రైతులు అంతా సిద్దంగా ఉన్నారని,కొందరు భూములు ఇవ్వవద్దని చెప్పినా రైతులు వినలేదని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశంలోనే విన్నూత్నమైన రీతిలో దీనిని చేపట్టామని అన్నారు. ఒక విజనరీగా తాను పనిచేస్తున్నానని అన్నారు.రైతులకు లాభం జరుగుతుందని వారు కూడా భావించారని ఆయన చెప్పారు. నవ్యాంధ్ర రాజధానిపై రైతులు సానుకూలంగా ఉన్నారు… ఇతరులు ఏం చెప్పినా ఆ పక్రియ ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు.