దివ్యాంగ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన ఉపాధ్యాయు లను ఎన్నికల విధుల నుండి మినహాయించాలి * టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజు
టేకులపల్లి, అక్టోబర్ 31 (జనం సాక్షి): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగ ఉపాధ్యాయులకు,దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు,ఫీడింగ్ మదర్స్ కు, రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వయోవృద్ధులకు కేటాయించినటువంటి జనరల్ ఎలక్షన్స్ 2023 విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ మంగళవారం జిల్లా కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెంకి ప్రాతినిధ్యం చేయడం జరిగిందని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.రాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగవైకల్యం గలవారికి,దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి,ఫీడింగ్ మదర్స్ కు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వయోవృద్ధులకు కేటాయించిన ఎలక్షన్ విధులను వారి శారీరక అనారోగ్యం దృష్ట్యా నిర్వహించుటకు సాధ్యపడదని,కాళ్లు చేతులు లేని వారికి,కంటిచూపు సరిగా లేనివారికి,డయాలసిస్ పేషెంట్లకు, హార్ట్ సర్జరీ చేయించుకుని బాధపడు తున్న వారికి,క్యాన్సర్ పేషెంట్లకు ఎలక్షన్ విధులు కేటాయించబడినవని,అటువంటివారు ఎలక్షన్ విధులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని,అటువంటి వారిని ఈ ఎన్నికల విధుల నుండి మినహాయించాలని వారు జిల్లా కలెక్టర్ ని కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్ర మంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు హరిలాల్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు వి.సరియా పాల్గొన్నారు.