దీపావళిప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి.

లక్ష్మీ నారాయణుని అనుగ్రహముతో అన్నింటా శుభం చేకూరాలి.
జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు.
జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్.
తాండూరు అక్టోబర్ 23(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా ప్రజలకు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినాన్ని వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని. చిన్నపిల్లలు కాకరొత్తులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. లక్ష్మీ నారాయణుని అనుగ్రహముతో అందరికి శుభం చేకూరాలని , సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.