దీర్ఘకాలిక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

నల్లబెల్లి అక్టోబర్ 22 (జనం సాక్షి):
దీర్ఘకాలిక వ్యాధుల పట్ల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీటీసీ శాపవాట్ దేవు నాయక్ అన్నారు. శనివారం మండలంలోని మూడు చెక్కలపల్లి గ్రామంలో బిపి, షుగర్ టాబ్లెట్ల కిట్లను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ సి చైర్మన్
శ్రీను నాయక్, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.