దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పై రఘు నందన్ రావు వ్యాఖ్యలు అర్థరహితం: కర్ణకంటి రజినీకాంత్
కొండమల్లేపల్లి అక్టోబర్ 18 జనం సాక్షి :
దేవరకొండ నియోజకవర్గం శాసన సభ్యులు రవీంద్ర కుమార్ ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ విధానాలు నచ్చి అందులో తాను కూడా భాగ్యసామి కావాలని పార్టీలో చేరారు. కానీ రాజగోపాల్ రెడ్డి లాగా కాంట్రాక్టుల కోసం అవకాశవాద రాజకీయాల కోసం, స్వార్థ ప్రయోజనాలు కోసం, స్వలాభం కోసం పార్టీ మారలేదని తెలంగాణ జాగృతి నియోజకవర్గ యూత్ కన్వీనర్ కర్ణకంటి రజినీకాంత్ ఆరోపించారు. రవీంద్ర కుమార్ దేవరకొండ నియోజకవర్గం లో పలు అభివృద్ధి పనులు చేశారు ఏడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ప్రతి మండలానికి గురుకుల పాఠశాలలు, గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారు, మరియు నియోజకవర్గమంతా దాదాపు బీటీ రోడ్లు ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ముందుండి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల శ్రేయస్కై పరితపిస్తున్న వ్యక్తి రవీంద్ర కుమార్ . కానీ రాజగోపాల్ రెడ్డి శాసనసభకు ఎన్నికైన తర్వాత ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చి అవి నెరవేర్చకుండా దాదాపు నాలుగు సంవత్సరాల పాటు నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చెయ్యకుండా ప్రజలకు అందుబాటులో లేకుండా ఎన్నికల ముందు ప్రత్యక్షమైన వ్యక్తి నియోజకవర్గంలో ఓట్లేసిన ప్రజలను విస్మరిస్తూ, తన స్వలాభాల కోసం మునుగోడు ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. రవీంద్ర కుమార్రా,జగోపాల్ రెడ్డి ఎక్కడ కూడా పొంతనలేదు. ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి నుంచి ఎమ్మెల్యేగా ఎదిగి ఈరోజు నియోజకవర్గ ప్రజా సమస్యల తీసుకొని పరిష్కరిస్తున్నారు ప్రజా సంక్షేమ తన ధ్యేయంగా భావించే వ్యక్తి దేవరకొండ నియోజకవర్గం ప్రజలందరూ మెచ్చిన నాయకులు రవీంద్ర కుమార్ డబ్బు సంచులతో మద్యం సీసాలతో గెలవాలనుకునే రాజగోపాల్ రెడ్డి కి రవీంద్ర కుమార్ ను విమర్శించటం రఘునందన్ గారి అవివేకమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 18 వేల కోట్ల కాంట్రాక్టుల అమ్ముడుబోయన రాజగోపాల్ రెడ్డి ఆ డబ్బులతో నియోజకవర్గంలో దాదాపు ఈ రోజు వందల కోట్లు ఖర్చుపెట్టి గెలవాలని ప్రయత్నిస్తున్నాడు మరి ఇదే రాజ గోపాల్ రెడ్డి వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఉంటే నియోజకవర్గం అభివృద్ధి కాకపోవున అనేది ఆత్మవిమర్శన చేసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. ఏనాడు ప్రజాసమస్యలపై అసెంబ్లీలో మాట్లాడని రాజగోపాల్ రెడ్డి తన కాంట్రాక్టు ల బిల్లుల కోసం మాత్రమే అసెంబ్లీలో మాట్లాడాడు.కానీ రవీంద్రకుమార్ అధికారపక్షం లో ఉండి కూడా తన నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ఎప్పుడూ సమయం వచ్చిన ప్రభుతాన్ని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో అంజి,సతీష్,రాజు,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area