దేవి నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): దేవి నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని  శ్రీ రామలింగేశ్వర సహిత త్రిశక్తి, అయ్యప్ప, ఆంజనేయ దేవాలయ చైర్మన్ అనంతుల సూర్యనారాయణ అన్నారు.శుక్రవారం స్థానిక ఆ  దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు.ఈనెల 26 నుండి అక్టోబర్ 5 వరకు జరుగు దేవీ నవరాత్రి దసరా ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. 26 న కలశ స్థాపన, మండపారాధన , రక్షాబంధన్ , అఖండ దీపారాధనతో ప్రారంభమై మంగళ గౌరీ దేవిగా అమ్మవారిని అలంకరించనిన్నట్లు తెలిపారు.27న బాల త్రిపుర సుందరి దేవి, 28న గాయత్రీ దేవి, 29న అన్నపూర్ణ దేవి, 30న లలిత త్రిపుర సుందరీ దేవి , అక్టోబర్ 1న  మహాలక్ష్మీ దేవి, 2న సరస్వతి దేవి , 3న దుర్గా మాత దుర్గాదేవి, 4న మహిషాసుర మర్దని దేవి, 5న  రాజరాజేశ్వరి దేవిగా అలంకరణలు చేయనున్నట్లు చెప్పారు. విజయదశమి రోజున శమీ పూజ కార్యక్రమంను నిర్వహించనున్నట్లు తెలిపారు .అంతకుముందు దేవాలయంలో షష్టి కృత్రికా నక్షత్రం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కళ్యాణం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ సెక్రటరీ గోరుగంటి వాసుదేవరావు , జాయింట్ సెక్రటరీ గుండా శంకర్, ఉపాధ్యక్షులు వాసా కృష్ణ , తోట శ్యాం ప్రసాద్, ధర్మకర్తలు బుచ్చి రాములు, దుర్గాప్రసాద్, శ్రీనివాస్  , కౌన్సిలర్ కక్కిరేని శ్రీనివాస్, వేణుమాధవ్ , మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.