దేశంలోకి జాన్ససన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్
అనుమతించిన కేంద్ర ప్రభుత్వం
సీరం కోవావ్యాక్సిన్ కూడా అందుబాటులోకి
న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కోవిడ్`19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దేశంలో మళ్లీ థర్డ్‌వేవ్ భయాలు, సకాలంలో టీకా అందించాలన్న లక్ష్యం దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీంతో కొత్తగా దీనికి అనమతి లభించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శనివారం ట్విటర్ వేదికగా ఈ వివరాలను తెలిపారు. మన్‌సుఖ్ మాండవీయ ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశం తన వ్యాక్సిన్ బాస్కెట్‌ను పెంచుకుందని తెలిపారు. భారత దేశంలో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ కోవిడ్`19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు దేశంలో 5 ఈయూఏ వ్యాక్సిన్లు ఉన్నాయన్నారు. కోవిడ్`19 మహమ్మారిపై భారత దేశ ఉమ్మడి పోరాటాన్నిఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు. బయలాజికల్ ఈ లిమిటెడ్ ద్వారా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌ను మన దేశానికి తీసుకొస్తారు. ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ కోసం దరఖాస్తు చేసిన రెండు రోజుల్లోనే ఈ వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది. మొత్తంగా ఇప్పుడు భారత్‌కు త్వరలోనే మరో విదేశీ టీకా రాబోతోంది. సింగిల్ డోస్
వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం అమెరికా ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు వెల్లడిరచారు. తమ వ్యాక్సిన్ అంతర్జాతీయ సరఫరాలో హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ కీలక పాత్ర పోషిస్తోందని జాన్సన్ అండ్ జాన్సన్ తెలిపింది. వ్యాక్సిన్ వినియోగంపై ఓ సారి దరఖాస్తు చేసి వెనక్కి తగ్గిన ఆ సంస్థ.. భారత్‌లో సింగిల్ డోస్ వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని గత వారం ప్రకటించింది. ఏప్రిల్ లోనే టీకా ట్రయల్స్ కు సంబంధించి అనుమతులు కోరగా.. తాజాగా వ్యాక్సిన్ వినియోగంపై దరఖాస్తు చేసింది.
మరోపక్క సీరం ఇన్‌స్టిట్యూట్ కూడా కొవోవ్యాక్స్‌కు అత్యవసర వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేసింది. అమెరికా కంపెనీకి చెందిన నొవావ్యాక్స్ వ్యాక్సిన్‌ను ఇండియాలో కొవోవ్యాక్స్‌గా ఉత్పత్తి చేయనుంది. నొవావ్యాక్స్ ఎఫికసీ రేట్ 93 శాతంగా ఉన్నట్టు ఆ సంస్థ చెబుతోంది. సెప్టెంబర్ నాటికి కొవోవ్యాక్స్‌ను అందుబాటులోకి తీసుకు రావాలని సీరం సంస్థ భావిస్తోంది. వివిధ వేరియంట్ల విూద ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పని చేస్తుందని చెబుతోంది. డెల్టా వేరియంట్‌కు కరెక్ట్ ఆన్సర్ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ అని ఆ సంస్థ చెబుతోంది. సింగిల్ డోస్‌తోనే డెల్టా వేరియంట్‌ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తుందని పరిశోధనల్లో తేలింది. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. టీకా ప్రభావం ఎనిమిది నెలల వరకు ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
టీకా వేసిన 28 రోజుల తర్వాత కొవిడ్ నుంచి రక్షణ కల్పించడం ప్రారంభమవుతుంది. ఇప్పటికే పలు దేశాలు అనుమతించిన వ్యాక్సిన్లను ట్రయల్స్ అవసరం లేకుండానే అత్యవసర వినియోగానికి అనుమతించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.