దేశంలో అత్యుత్తమ సీఎంగా కేసీఆర్
న్యూఢిల్లీ,మే27(జనంసాక్షి):దేశంలోనే ది బెస్ట్ సీఎం మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరేనని వీడీపీ అసోసియేట్స్ సర్వే తేల్చింది. దేశంలోని ఎలక్టోరల్ ట్రెండ్స్ ను ఎప్పటికప్పుడు అంచనా వేసే పోలింగ్ ఏజెన్సీ వీడీపీ అసోసియేట్స్. ఇండియా ఒపీనియన్ పోల్ పేరిట అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరుపై ప్రజల అభిప్రాయాలను సేకరించింది. తెలంగాణ సర్కారు పాలనతో సంతృప్తి చెందామని 86 శాతం ప్రజలు నీరాజనాలు పట్టారు. సీఎం కేసీఆర్ ను ఇండియాస్ మోస్ట్ పాపులర్ సీఎంగా ప్రకటించింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 81 శాతం ఓటింగ్ తో రెండో ప్లేస్ లో ఉండగా.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మూడో స్థానంలో, తమిళనాడు సీఎం జయలలిత నాలుగో స్థానంలో ఉన్నారు. అటు ఏపీ సీఎం చంద్రబాబు పాలనతో 69శాతం మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారని సర్వే తెలిపింది. కాగా.. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వీడీపీఏ సంస్థ సర్వే తేల్చింది.