దేశంలో 50కోట్లు దాటిన వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ

వెల్లడిరచిన కేంద్ర మంత్రి భారతి పవార్‌
న్యూఢల్లీి,అగస్టు7(జనంసాక్షి): దేశంలో కరోనా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ 50 కోట్లు దాటిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ 50 కోట్లు దాటడం గర్వకారణమని కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి పవార్‌ అన్నారు. కరోనాపై పోరాటానికి వ్యాక్సినేషన్‌ ముఖ్యమన్నారు. ప్రజలకు వ్యాక్సిన్‌ అందించేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. మొదట్లో రోజుకూ 2 లక్షల 50 వేల డోసుల వ్యాక్సిన్‌ ఉత్పత్తి జరిగేదని, ప్రస్తుతం రోజుకూ 40 లక్షల వ్యాక్సిన్‌ డోసులు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఉత్పత్తి పెరిగిన కారణంగా ప్రజలకు మరింత మెరుగైన పద్ధతిలో వ్యాక్సిన్‌ అందించొచ్చన్నారు. ఇందుకోసం కేంద్రం కృషి చేస్తుందన్నారు. చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్‌ పై అడగ్గా….ఎఫికసి,ఇమ్యూనోజెనిసిటి ఆధారంగా వ్యాక్సిన్‌ తయారవుతుందని చెప్పారు భారతి పవార్‌. సేప్టీ మెజర్స్‌ దృష్టిలో పెట్టుకుని ట్రయల్స్‌ కొనసాగుతున్నాయన్నారు. త్వరలోనే పిల్లల వ్యాక్సిన్‌ తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

తాజావార్తలు