దేశభక్తిని చాటేలా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలి
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
చేర్యాలలో ఘనంగా ఫ్రీడం ర్యాలీ
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 13 : 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం చేర్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో ఫ్రీడం ర్యాలీ ఘనంగా నిర్వహించారు. చేర్యాల అంగడి బజారు నుండి కొత్త బస్టాండు వరకు జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించి త్రివర్ణ రంగుల బెలూన్లను ఎగరవేశారు. అనంతరం ప్రెజెంటేషన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన వజ్రొత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేసి ప్రజలందరూ దేశభక్తిని ఛాటెలా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అమరులైన అమరవీరులను స్మరించుకుని నివాళులర్పించాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అంకుగారి స్వరూప రాణి-శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జి.రాజేంద్ర కుమార్, చేర్యాల సీఐ మంచినీళ్ల శ్రీనివాస్, ఏఎస్ఐ వి. నవీన్ కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ జె. ప్రభాకర్, టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, కౌన్సిలర్లు పచ్చిమడ్ల సతీష్ గౌడ్, ఆడెపు నరేందర్, సందుల సురేష్, ఎండి.జుబేదా కాతూన్-ఇక్బాల్, యాట పద్మ-యాదగిరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పూర్మ వెంకటరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల నర్సయ్య, టిఆర్ఎస్ యూత్ నియోజకవర్గ అధ్యక్షులు శివగారి అంజయ్య, మాజీ కొమురెల్లి దేవస్థాన చైర్మన్ ముస్త్యాల కిష్టయ్య, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వరరావు, టిఆర్ఎస్ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు పచ్చిమడ్ల మానస, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, పాఠశాలల ప్రిన్సిపల్ లు,ఉపాధ్యాయులు, నాయకులు, వ్యాపారస్తులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.