దేశసర్వతోముఖాభివృద్ధికి సర్కారు కట్టుబడి ఉంది

5

– పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 23(జనంసాక్షి): రైతుల సంక్షేమం ద్వారానే దేశ సర్వతో ముఖాభివృద్ధి సాధ్యమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. దేశాభివృద్ధికి దూరదృష్టితో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా మంగళవారం ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. అందరితో కలసి అందరికోసం ముందుకు నడవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పార్లమెంటులో చర్చలకు ప్రాధాన్యం ఉండాలని, రచ్చకు కాదన్నారు.

సబ్‌ కే సాత్‌ సబ్‌కా వికాస్‌ అనే నినాదంతో దేశాభివృద్ధి కోసం ప్రభుత్వం దూరదృష్టితో కృషి చేస్తోందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు.ఆహార భద్రత, అందరికీ నివాసం అత్యంత ప్రాధాన్యత అంశాలుగా పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలకు కూడా చేరాలన్నారు. పేదరికాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనధనయోజన పథకం విజయవంతమైందని వెల్లడించారు. రైతులకు చేయూత, యువతకు ఉపాధి లక్ష్యంతో ప్రభుత్వం పథకాలు రూపొందిస్తోందన్నారు. ఆహార భద్రత, అందరికీ నివాసం అత్యంత ప్రాధాన్య అంశాలని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. జన్‌ధన్‌యోజన పథకం ప్రపంచంలోనే మంచి ఆర్థిక వృద్ధి పథకమని, పేదరిక నిర్మూలనకు ప్రధాని జన్‌ధన్‌ యోజన ఉపయోగపడుతోందన్నారు. ప్రధానమంత్రి సురక్షా బీమాయోజన, జీవన్‌జ్యోతి, అటల్‌ బీమా యోజన పథకాలు ప్రజలకు భరోసా ఇచ్చే పపథకాలని వివరించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి పార్లమెంట్‌ సెంట్రల్‌హాలులో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న చర్యలను వివరించారు. తక్కువ ప్రీమియంతో పంటల బీమా పథకం ద్వారా రైతులకు భరోసా కల్పించడం,  భూసార పరీక్షల కార్డులు పంపిణీ, 8వేల క్లస్టర్లద్వారా ప్రకృతి వ్యవసాయం, రైతులకు చేయూత, యువతకు ఉపాధి లక్ష్యంతో ప్రభుత్వం పథకాలు రూపొందిస్తోందని ప్రణబ్‌ వివరించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పన కోసం ఈ-మార్కెట్లు ఏర్పాటు, దేశంలో ఎక్కడైనా పంట ఉత్పత్తులు అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తున్నామని అన్నారు.  ప్రభుత్వం కొత్త యూరియా విధానం అమలు చేస్తోంది. కొత్త విధానం ద్వారా మూడేళ్లలో 17లక్షల టన్నుల యూరియా ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.  గ్రావిూణాభివృద్ధికి పాల ఉత్పత్తి, కోళ్లు, మత్స్య పరిశ్రమలకు ప్రోత్సాహం, రైతుల అభ్యున్నతికి 109 కిసార్‌ వికాస్‌ కేంద్రాలు ఏర్పాటు, ఐదు మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయన్నారు.భారత్‌

మొత్తాన్ని ఫుడ్‌జోన్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రైతులు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. రైతుల కోసం కొత్తగా బీమా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. కొత్త యూరియా పాలసీ ప్రవేశపెట్టామని వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తులు పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. గ్రావిూణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. దేశంలో 68 కోట్ల జనాభాకు ఆహార భద్రత కల్పిస్తున్నామన్నారు. కిసాన్‌ టీవీ ద్వారా రైతులకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తున్నామన్నారు. ముద్ర బ్యాంకు ద్వారా యువతకు రుణాలిస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తులు పెంచేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.  ఉగ్రవాదం ప్రపంచానికి సవాలుగా మారిందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. అయితే దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. పఠాన్‌కోట్‌ ఉగ్రదాడిని మన భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికోట్టాయని శ్లాఘించారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.  2018 నాటికి అన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా కల్పిస్తామన్నారు. గంగాజలాల శుద్ధికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మహిళల భద్రత కోసం పలు కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. వన్‌ ర్యాంక్‌, వన్‌ పెన్షన్‌ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. వసుదైక కుటుంబానికి కట్టుబడి ఉన్నామన్నారు. నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌తో సత్సంబంధాలు నెలకొల్పుకుంటున్నామని తెలిపారు. ప్రజల మనోభావాలను పార్లమెంట్‌ ప్రతిభింబింప జేస్తుదని తెలిపారు. సభలో రభస లేకుండా సమస్యలపై చర్చించాలని సభ్యులను కోరారు. సత్యం, శివం, సుందరం ఆదర్శంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.  ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు. వివిధ పథకాలను ప్రశంసించారు. మేక్‌ ఇన్‌ ఇండియా ద్వారా 39 శాతం విదేశీ పెట్టుబడులు పెరిగాయని పేర్కొన్నారు. స్టార్టప్‌ ఇండియా ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహమందిస్తామని తెలిపారు. యువత ఉద్యోగాలును వెతుక్కునే పరిస్థితి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరేలా శిక్షణ ఇస్తున్నామన్నారు. పౌష్టికాహార లోప నివారణకు కృషి చేస్తున్నామన్నారు. స్వచ్ఛ్‌ భారత్‌ కార్యక్రమం ద్వారా పరిశుభ్రతపై అవగాహన పెరిగిందని తెలిపారు. దేశంలో పౌరులందరికీ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దేశాభివృద్ధి కోసం ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచిస్తుందన్నారు. 2017 నాటికి రైతులందరికీ భూసార కార్డులు అందిస్తామన్నారు. ప్రతి పౌరునికి సామాజిక భద్రత కోసం మూడు ఇన్సూరెన్స్‌ పథకాలు ప్రవేశపెట్టామని వెల్లడించారు. అంబేద్కర్‌ ఆశయాలను సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్‌ ధన్‌ యోజన సక్సెస్‌ అయిందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు.పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.ఇరవైఒక్క కోట్ల జన్‌ దన్‌ యోజన బ్యాంకు ఖాతాలలో పదిహేను కోట్ల ఖాతాలు ఆపరేషన్‌ లో ఉన్నాయని అన్నారు. వాటి ద్వారా ముప్పై నాలుగువేల కోట్ల మొత్తం పొదుపుచేసుకున్నారని ప్రణబ్‌ అన్నారు.దీనివల్ల పేదలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. ఆహార భద్రత పధకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.68 వేల కోట్ల రూపాయలు ఇందుకు వెచ్చిస్తున్నామని అన్నారు.కేంద్రం చేపట్టిన వివిధ స్కీములను ఇందులో ప్రస్తావించారు. మేక్‌ ఇన్‌ ఇండియా ద్వారా దేశాన్ని ముందుకు తీసుకు వెళుతున్నామని అన్నారు. గృహ నిర్మాణ స్కీమ్‌ కు24500 కోట్ల రూపాయల వ్యయం చేస్తున్నామని అన్నారు.రైతులు ఎక్కడైనా తమ ఉత్పత్తులు అమ్ముకునే విదంగా విధానం రూపొందిస్తున్నామని ఆయన అన్నారు.రాష్ట్రపతి ప్రసంగం కాస్త నెమ్మదిగా

సాగుతున్నట్లు అనిపించింది.సభలో రభస లేకుండా సమస్యలపై చర్చించాలని సభ్యులను కోరారు. సత్యం, శివం, సుందరం ఆదర్శంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.  ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు. వివిధ పథకాలను ప్రశంసించారు. అనంతరం జాతీయ గీతాలాపనతో రాష్ట్రపతి ప్రసంగం ముగిసింది.   పార్లమెంట్‌ సెంట్రల్‌ హాలుకువిచ్చేసిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, ఉప రాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ఎం.వెంకయ్యనాయుడు తదితరులు స్వాగతం పలికారు.  కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, భాజపా సీనియర్‌ నేత ఎల్‌.కె.అడ్వాణీ సహా వివిధ పార్టీల ముఖ్యనేతలు, కేంద్రమంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.

బడ్జెట్‌ కేటాయింపులపై తెలంగాణ నేతల ఆశ

ఆశాజనకంగా ఉంటుందంటున్న ఎంపిలు

కేంద్ర బడ్జెట్‌ సమావేశాలపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆశాజనకంగా ఉన్నారు. రైల్వే, జనలర్‌ బడ్జెట్‌లో తెలంగాణకుకేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నారు. వివిధ పద్దలకు లేదా కేటాయంపులకు సంబంధించి ఎంపిలు ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకుని వెల్లారు. బడ్జెట్‌ ఆశాజనకంగా ఉంటుందనే ఆశిస్తున్నట్లు ఎంపి  కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఆమె ఢిల్లీలో విూడియాతో మాట్లాడారు. ఈసారి కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టే విధంగా ఉంటాయని భావిస్తున్నానన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాయకుండా ప్రజల బడ్జెట్‌ను ప్రతిబింబింభింపజేస్తుందని ఆశిస్తున్నానన్నారు. ఎంఎంటీఎస్‌ రైళ్లను యాదగిరిగుట్ట వరకు పొడిగింపునకు అనుమతి వస్తుందని ఆశిస్తున్నామని టీఆర్‌ఎస్‌ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. ఇందుకోసం మూడో వంతు నిధుల కేటాయింపునకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రైళ్లు తగలబెడితేనే రిజర్వేషన్లు వస్తాయనే సంకేతాలు సరికాదన్నారు. దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని బూర నర్సయ్యగౌడ్‌ కోరారు. ఇదిలావుంటే ప్రాజెక్టులకు గుర్తింపు కేటాయింపులపైనా నేతలు ఆశగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి జాతీయ నీటి ప్రాజెక్టును ఇవ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నీటి ప్రాజెక్టుల అనుమతులకు ప్రస్తుతం ఉన్న విధానాలు మార్చాలని, మిషన్‌ కాకతీయకు సహకరించాలని ఆయన కోరారు. వివిధ ప్రాజెక్టులకు అనుమతులివ్వటంలో కేంద్ర జలవనరుల సంఘం వద్ద జరుగుతున్న జాప్యాన్ని నివారిస్తే ఆయా పథకాల వ్యయం పెరగదని తద్వారా ప్రజలపై భారం తగ్గుతుందని హరీశ్‌రావు కేంద్రానికి సూచించారు. ఇలా అనేక అంశాలపై తెలంగాణ నేతలు బడ్జెట్‌ కేటాయింపుల కోసం చూస్తున్నారు.