దేశానికి ఆదర్శంగా తెలంగాణ రైతు విధానాలు

అమలు చేస్తే హరిత విప్లవం సాధ్యమే
రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లా
వరంగల్‌,జూన్‌20 జ‌నంసాక్షి : తెలంగాణలో సిఎం కెసిఆర్‌ అనుసరిస్తున్న రైతు విధానాలను భారతదేశ
వ్యాప్తంగా అమలు చేస్తే దేశంలో హరితవిప్లవం సాధించవచ్చని రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వరరెడ్డి అభిప్రాయపడ్డారు. రైతులకు సాగునీరు, పెట్టుబడి పథకం,బీమా పథకం అమలు చేయడం, పండిన ధాన్యం కొనుగోలు చేయడం వంటి పథకాలు పక్కాగా అమలయితే దేశంలో కరువు కాటకాలు ఉండవన్నారు. రైతుబీమా పథకం దేశానికే మార్గదర్శకంగా మారనుందని అన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలని తపిస్తున్న సిఎం కెసిఆర్‌ రైతును రాజు చేయడమే లక్ష్యంగా అనేకానేక చర్యలు తీసుకుని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారని పల్లా అన్నారు. ఇవన్నీ సాకారం చేసుకునే దిశగా తెలంగాణ ఒక్కో అడుగు వేస్తున్నదని, వేసిన అడుగు విజయవంగా సాగుతున్నదని అన్నారు. రానున్న కాలంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో ఓ రోల్‌ మాడల్‌గా నిలవబోతున్నదని అన్నారు. రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేయడమే ఓఓ కీలక నిర్ణయమని అన్నారు. ఇలా వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి, ప్రవేశపెట్టిన పథకాలు గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ వ్యవసాయరంగంలో నంబర్‌వన్‌ రాష్ట్రంగా నిలిచిందన్నారు. దురదృష్టవశాత్తు, అనారోగ్యకారణాల వల్ల రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.5 లక్షలు బీమా పరిహారం అందుతుందన్నారు.ఈ రకంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని అన్నారు. పెట్టుబడి పథకం కింద ఎలాగైతే రైతుబంధు పథకం పక్కాగా అమలయ్యిందో ఇప్పుడు బీమా పథకం కూడా పక్కాగా అమలు చేయడానికే జిల్లాల్లో పర్యటిస్తున్నామని అన్నారు. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే నామినీకి పది రోజుల్లో రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ అందుతుందని చెప్పారు. అందుకే ఈ పథకాలను తెలుసుకున్న దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సీఎం కేసీఆర్‌ను కొనియాడుతు న్నాయన్నారు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్‌ రైతు బీమా పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారని పల్లా అన్నారు. ఎన్నడూలేని విధంగా పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నామని, పక్క రాష్టాల్ల్రో సరైన మద్దతు ధర లభించని రైతులు కూడా తెలంగాణకు వచ్చి అమ్ముకుంటున్నారని తెలిపారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసే రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. కాళేశ్వరం సహా చేపట్టిన అన్ని ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని, ఇక సాగునీటికి ఢోకా ఉండదన్నారు. ఇప్పటికే చెరువుల పునరుద్దరణ జోరుగా సాగుతోందన్నారు. దీంతో సేద్యం అన్నది రైతుకు భారం కాబోదన్నారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని పేర్కొన్నారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతుంటే కాంగ్రెస్‌ వాళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలోనే తెలంగాణ ఒక్కటేనన్నారు.రాష్ట్ర ఆవిర్భావం మొదటి ఏడాదిలో కరెంట్‌ ఇబ్బంది ఉండేదని, పక్క రాష్టాల్ర నుంచి అతికష్టం విూద విద్యుత్‌ను కొనుగోలు చేసి 25లక్షల మంది బోర్లకు విద్యుత్‌ను అందించామన్నారు. గతంలో మాదిరిగా రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా విత్తనాలు, ఎరువులు ముందుగానే స్టాక్‌ పెట్టుకుంటున్నమని పేర్కొన్నారు.
పండిన పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నమని పేర్కొన్నారు. తెలంగాణలో 24గంటల కరెంట్‌, నీళ్లు, పెట్టుబడి, ఎరువులు, విత్తనాలు ఇస్తున్నరని ఆయన స్పష్టంచేశారు.