దేశానికి దిక్సూచి తెలంగాణ కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి బాట పటాన్చెరు లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

పటాన్ చెరు జూన్ 2(జనం సాక్షి)
పోరాడి సాధించుకున్న తెలంగాణను నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశానికి దిక్సూచి గా మార్చారనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పటాన్చెరు నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. పటాన్చెరు పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. పటాన్చెరు పట్టణంలోని ఎంపిడిఓ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం, బల్దియా కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు అస్తిత్వం కోసం పోరాటం చేసిన తెలంగాణ నేడు అభివృద్ధి పథంలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలచిన మహోన్నత నాయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ను అందిస్తూ ఇటు వ్యవసాయ రంగంలో అటు పారిశ్రామిక రంగంలో నూతన అధ్యాయాన్ని లిఖించడం జరిగిందన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాల ద్వారా రైతుకు వెన్నుదన్నుగా నిలవడంతో పాటు కాలేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ద్వారా వ్యవసాయ రంగంలో వినూత్న సంస్కరణలు తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధికి అండగా నిలవాల్సిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పక్షపాత వైఖరిని అవలంభించడం సిగ్గుచేటన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా పటాన్చెరు నియోజకవర్గాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఒకప్పుడు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన పటాన్చెరు నేడు గేటెడ్ కమ్యూనిటీ లకు చిరునామా గా నిలవడం  సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు వివిధ వర్గాలు అందించిన సహాయ సహకారాలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు