దేశ ఆర్థిక ప్రగతిపై సలహాలివ్వండి

1

నీతి ఆయోగ్‌ భేటీలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి6(జనంసాక్షి):  రాష్టాల్ర మధ్య ఆరోగ్యకర పోటీకే నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టామని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. నీతిఆయోగ్‌పై ఆర్థికవేత్తలతో ప్రధాని సమావేశమయ్యారు. దేశ ఆర్థిక స్థితితని గాడిలో పెట్టేందుకు మేధోమథనం చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. నిపుణులు, ఆర్థికవేత్తల సలహాలను నీతి ఆయోగ్‌ తీసుకుంటుందన్నారు. ప్రభుత్వానికి వెలుపల ఉన్న వారి సేవలను నీతి ఆయోగ్‌లో వినియోగిస్తామని తెలిపారు. సమాఖ్య వ్యవస్థను నీతి ఆయోగ్‌ పరిపుష్టం చేస్తుందన్నారు. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్‌ను ప్రవేశపెట్టిన విషయం విదితమే. నీతిఆయోగ్‌ తొలి సమావేశం లో పలు అంశాలను చర్చించారు. అనంతరం ఆర్థికమంత్రి జైట్లీ మాట్లాడుతూ ఆర్థిక ప్రయోజనాలపై చర్చించామని అన్నారు. ఆర్థికంగా దేశాన్ని ముందుకు తీసుకుని వెల్లే క్రమంలో ప్రధాని మేధావులతో చర్చించారన్నారు. పలు అంశాలను చర్చించామన్నారు.