భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీజీ సేవలు మరువలేనివి టిపిసిసి కార్యవర్గ సభ్యులు కేతావత్ బిల్యా నాయక్

కొండమల్లేపల్లి అక్టోబర్ 31 జనం సాక్షి న్యూస్ : భారత తొలి ఏకైక మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీజీ సేవలు మరువలేనివి అని స్వర్గీయ ఇందిరా గాంధీజీ వర్ధంతి సందర్భంగా టిపిసిసి కార్యవర్గ సభ్యులు కేతావత్ బిల్యా నాయక్ నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రఖ్యాతిగాంచిన కుటుంబంలో జన్మించిన స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీజీ స్వతంత్ర భారత తొలి ప్రధాని స్వర్గీయ శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రుజీ గారి కుమార్తె స్వర్గీయ ఇందిరా గాంధీజీ ప్రముఖ అంతర్జాతీయ విద్యాసంస్థలలో విద్యాభ్యాసం చేశారు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్, డిగ్రీలు పొందారు భారత అత్యంత ప్రధానమంత్రి పదవిని అలంకరించి దేశానికి ఆమె విలువైన సేవలు అందించారు శ్రీమతి స్వర్గీయ ఇందిరా గాంధీజీ భారతరత్న అవార్డు స్వీకరించారు ఆరోజుల్లోనే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత్ తరపున ప్రసంగించారు స్వర్గీయ ఇందిరా గాంధీజీ తెచ్చిన సంస్కరణలు, బ్యాంకుల జాతీయం లాంటి ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు భారతదేశ అభివృద్ధికి బాటలు వేశాయన్నారు స్వర్గీయ ఇందిరా గాంధీజీ దేశానికి సేవించిన సేవలను కొనియాడారు

తాజావార్తలు