దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు : ఎస్పీ
విజయనగరం, జూలై 17 : ప్రజల సహకారంతో దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్నట్లు జిల్లా ఎస్పీ కార్తికేయ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో రాత్రి పెట్రోలింగ్‌ను, రాత్రి బీటులను విస్తృతం చేయడంతో పాటు వాటి పర్యవేక్షణకు అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. నేరాల నియంత్రణకు పోలీస్ శాఖకు ప్రజలంతా సహకరించాలన్నారు. అనుమానస్పద వ్యక్తుల సమాచారాన్ని 08922- 1090, 226677కు తెలపాలన్నారు. నేరం జరిగిన తర్వాత సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలన్నారు. నేర స్థలాన్ని పోలీసులు వచ్చేంతవరకు చద్రం చేయకుండా భద్రంగా ఉంచాలన్నారు.