*దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలి* :మున్సిపల్ చైర్మన్ కరుణ శ్రీ సాయినాథ్*

పెబ్బేరు జులై 28 ( జనంసాక్షి ): పెబ్బేరు మండల కేంద్రంలో డెంగ్యూ వ్యాధి పై నివారణ మాసోత్సవము ర్యాలీ ప్రాథమిక  ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హాస్పిటల్  నుండి స్థానిక సుభాష్ చౌరస్తా వరకు ర్యాలీ  నిర్వహించారు.మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీ సాయినాథ్, మండల జెడ్పీటీసీ శ్రీమతి పద్మ వెంకటేష్, డాక్టర్ సాయిశ్రీ లు ర్యాలీ ని ప్రారంభించారు.
సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షా కాలము లో ఎక్కువగా సీజనల్ వ్యాధులు వస్తాయని, ముఖ్యముగా  డెంగ్యూ దోమల పెరగకుండా ప్రతి శుక్రవారం మరియు ఆదివారము రోజులలో మన ఇంటి పరిసరాలు శుభ్రముగా చేసుకోవాలి, దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలని తెలిపారు. సాయంకాలము సమయము లో వేప ఆకు పొగ పెట్టుకోవాలి, ఈ డెంగ్యూ దోమలు ఎక్కువగా పగటి పూట కుట్టుతవి, ప్రజలందరూ జాగ్రత్త గా ఉండాలని తెలిపారు.
 కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి శ్యామల, మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి, మున్సిపల్ కమిషనర్ జాన్ కృపాకర్, డాక్టర్ షేఫి, కౌన్సిలర్లు పద్మ , సుమతి,   హెల్త్ సూపర్ వైజర్స్, సూర్యనారాయణ,వెంకట సుబ్బమ్మ,,హెల్త్ అసిస్టెంట్ లు రాజశేఖర్,తిరుపతయ్య,ఏ ఎన్.ము లు ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area