దోమలు పుట్టకుండా చేద్దాం

డెంగ్యూ వ్యాధిని తరిమికొడదాం

వనపర్తి జులై 28 (జనం సాక్షి) దోమలు పుట్టకుండా చేద్దాం,దోమలు కుట్టకుండా చేద్దాం,డెంగ్యూ వ్యాధిని తరిమికొడదాం అని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధి అవగాహన ర్యాలీని గురువారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రవిశంకర్,మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవులు పాల్గొని మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధిని తరిమికొట్టడానికి ప్రజలందరూ ఏకం కావాలని వారు పిలుపునిచ్చారు.డెంగ్యూ వ్యాధి ఎడిస్ ఈజిస్టయి అనే దోమ కుట్టడం వల్ల వస్తుందని,ఈ దోమ లు పగటిపూట కుడతాయని, ఇది చికెన్ గునియా కంటే ఎక్కువగా ఒంట్లో శక్తిని హరించేస్తుందని సరైన సమయంలో చికిత్స చేయించుకున్నట్లయితే వ్యాధిసోకిన 50 మందిలో ఒకరు మరణించే ప్రమాదం ఉందని అందుకే దోమలు పుట్టకుండా ప్రతి ఒక్కరూ వారి పరిసర ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని,నిల్వ ఉన్న నీటిలో దోమలు తొందరగా వృద్ధి చెందుతాయని,  కాబట్టి నీరు పారే విధంగా డ్రైనేజీ ఏర్పాటు చేసుకొని నీరు నిల్వ ఉండకుండా చూడాలని వారు వివరించారు.పాత వస్తువులు,పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా జాగ్రత్త తీసుకోవాలని వారన్నారు.అలాగే దోమలు కుట్టకుండా బయటి గుమ్మం ద్వారా దోమలు లోపలికి రాకుండా జాలీలు ఏర్పాటు చేసుకోవాలని,దోమతెరలు వాడాలని,వేపాకుతో పొగ పెట్టడం,మస్కిటో కాయిల్స్ బిల్లలు కాల్చడం లాంటివి చేస్తూ దోమలు కుట్టకుండా వీలైనంతవరకు పగటిపూట పొడుగు చేతులు చోక్క, పైజామా,ప్యాంటు మొదలగు వాటి ధరించి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని వారు వివరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ఎ.శ్రీనివాసులు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రామచంద్ర రావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి  అధికారులు చంద్రయ్య, శ్రీనివాస్,మధు,బాలస్వామి,మహేష్,రాజు,రాము,ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.
2 Attachments